TS INTER RESULTS 2020 LIVE UPDATES TELANGANA STATE BOARD OF INTERMEDIATE EDUCATION LAUNCHES GRIEVANCE REDRESSAL SYSTEM BIGRS PORTAL TO RECEIVE COMPLAINTS FROM STUDENTS SS
TS Inter Results 2020: మీ ఇంటర్ ఫలితాలపై డౌట్స్ ఉన్నాయా? ఇలా కంప్లైంట్ చేయండి
TS Inter Results 2020: మీ ఇంటర్ ఫలితాలపై డౌట్స్ ఉన్నాయా? ఇలా కంప్లైంట్ చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
TS Inter Results 2020 Live updates | ఇంటర్ ఫలితాల్లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా? మార్కులు తక్కువగా వచ్చాయని డౌట్‌గా ఉందా? అయితే ఇంటర్ బోర్డుకు ఎలా కంప్లైంట్ చేయాలో తెలుసుకోండి.
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, వొకేషనల్ ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది ఇంటర్ ఫలితాల విషయంలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు ఎదుట రోజుల తరబడి ధర్నాలు కూడా చేశారు. ఇంటర్ బోర్డు తీరు కూడా వివాదాస్పదమైంది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-TSBIE జాగ్రత్తలు తీసుకుంది. మూల్యాంకనం దగ్గర్నుంచి ఫలితాల విడుదల వరకు అన్ని దశల్లో ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్నారు అధికారులు. ఫలితాల విడుదలలో జాప్యం జరగడానికి ఇది కూడా ఒక కారణం. అన్నీ పక్కాగా సరిచూసుకున్న తర్వాత ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు అధికారులు. అయితే ఇప్పటికీ ఇంటర్ ఫలితాల విషయంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే తమను సంప్రదించొచ్చని చెబుతున్నారు అధికారులు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి సమస్యలు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా 'టీఎస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియర్ ఎడ్యుకేషన్ గ్రీవియెన్స్ రిడ్రసల్ సిస్టమ్-BIGRS' ఏర్పాటు చేశారు. http://bigrs.telangana.gov.in/ పేరుతో వెబ్సైట్ కూడా ప్రారంభించారు. BIGRS ఆండ్రాయిడ్ యాప్ కూడా గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇంటర్ ఫలితాలపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా ఈ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించుకొని కంప్లైంట్స్ చేయొచ్చు. విద్యార్థులు http://bigrs.telangana.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ సమస్యను వివరించేందుకు Raise Grievances పైన్ క్లిక్ చేయాలి. మీ సమస్యను అక్కడ వివరించాలి. మీ కంప్లైంట్ ఇంటర్ బోర్డు అధికారులకు వెళ్తుంది. మీ సమస్య పరిష్కారమైందో లేదో స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.