TS Inter Results 2020 | ఫెయిలైతే టెన్షన్ వద్దు... సైకాలజిస్టుల సేవలు.. ఫోన్ నెంబర్లు ...

TS Inter Results Manabadi | తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఫెయిలైన వారికి ఒత్తిడి నుంచి దూరం చేసేలా సైకాలజిస్టుల సేవలు అందుబాటులోకి తెచ్చింది ఇంటర్ బోర్డు.

news18-telugu
Updated: June 18, 2020, 4:00 PM IST
TS Inter Results 2020 | ఫెయిలైతే టెన్షన్ వద్దు... సైకాలజిస్టుల సేవలు.. ఫోన్ నెంబర్లు ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం మంది, రెండో సంవత్సరం వారు 68.86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండియర్ రెండు సంవత్సరాల ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. తెలంగాణలో రెండు సంవత్సరాలకు కలిపి 9,65,839 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో మొదటి సంవత్సరం వారు 4,80,516 కాగా, రెండో సంవత్సరం విద్యార్థులు 4,85,323 మంది పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 4 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి 2,88,383 మంది ( 60.01 శాతం) పాస్ అయ్యారు. బాలికలు 67.47 శాతం, బాలురు 52.30 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెంకండియర్‌లో 2,83,462 మంది (68.86 శాతం) పాస్ అయ్యారు. వారిలో బాలికలు హవా చూపారు. బాలికలు హవా 75.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 62.10 శాతం పాస్ అయ్యారు.


ఫెయిల్ అయిన విద్యార్థులు ఒత్తిడితో ఏమైనా అఘాయిత్యాలు చేసుకుంటారేమోననే ముందస్తు జాగ్రత్తతో రాష్ట్ర ప్రభుత్వం కొందరు క్లినికల్ సైకాలజిస్టుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఏడుగురు సైకాలజిస్టుల ఫోన్ నెంబర్లు కూడా అందజేసింది. ఎవరైనా విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనతో ఉంటే సైకాలిజిస్టుల సేవలు పొందవచ్చు.

TS Inter Results 2020 | ఫెయిలైన విద్యార్థులకు సైకాలజిస్టుల సేవలు
Published by: Ashok Kumar Bonepalli
First published: June 18, 2020, 3:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading