TS Inter Results 2020: పరీక్షల్లో పాస్ కాలేదా? ఒత్తిడిని జయించడానికి ఈ టిప్స్ ఫాలో అవండి

Overcome Depression | పరీక్షల్లో అనుకున్నన్ని మార్కులు రాలేదా? ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యారా? ఒత్తిడి జయించడానికి ఈ టిప్స్ ఫాలో అవండి.

news18-telugu
Updated: June 18, 2020, 3:50 PM IST
TS Inter Results 2020: పరీక్షల్లో పాస్ కాలేదా? ఒత్తిడిని జయించడానికి ఈ టిప్స్ ఫాలో అవండి
కరోనా వైరస్ కారణంగా యూకే లోని సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజల్లో డిప్రెషన్ తీవ్ర స్థాయిలో ఉందని ఈ నివేదిక తేల్చింది. కరోనావైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ నెలలో డిప్రెషన్ మరియు ఆందోళన సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య 52 శాతానికి చేరుకుంది.
  • Share this:
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల ఫలితాలు అనగానే మనకు గుర్తొచ్చేది టాపర్స్ మాత్రమే కాదు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యలు కూడా. పరీక్షల్లో పాస్ కాకపోవడం, మార్కులు తక్కువ రావడం, టాప్‌లో నిలవకపోవడం, అనుకున్న స్కోర్ చేయకపోవడం ఇలాంటివన్నీ ఒత్తిడికి గురిచేస్తుంటాయి. ఈ ఒత్తిడే ఆత్మహత్యలకు దారితీస్తుంటుంది. భారతదేశంలో ఆత్మహత్య చేసుకుంటున్న యువతీయువకుల సంఖ్య ఎక్కువే. ఇందుకు ప్రధాన కారణం... చదువులో రాణించకపోవడమే. జీవితం అంటే చదువు మాత్రమే కాదు. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రానా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ జీవితం ఇంటర్ దగ్గరో, డిగ్రీ దగ్గరో ఆగిపోదు. ఆగిపోకూడదు.

ఫెయిల్ అయ్యామనో, మార్కులు తక్కువ వచ్చాయనో తెలియగానే ఒత్తిడికి గురికావడం సహజమే. కానీ ఆ ఒత్తిడిని జయించే మార్గాలను వెతుక్కోవాలి. ఇప్పుడు పరీక్షల్లో మంచి మార్కులు రాకపోతే తర్వాతి ఎగ్జామ్స్‌లో ఎలా మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆలోచించాలి. మీ ఫలితాలను విశ్లేషించుకోవాలి. ఎక్కడ తప్పు చేశారో తెలుసుకోవాలి. మళ్లీ అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తపడాలి. మార్కులంటే కేవలం నెంబర్ మాత్రమే. అవే మీ జీవితం కాదు. మీ టాలెంట్ ఏంటో తెలుసుకోవాలి. అందులో రాణించడానికి ఏం చేయాలో ప్రణాళిక రూపొందించుకోవాలి. పరీక్షల్లో మీరొక్కరే ఫెయిల్ కాలేదు. మీకు మాత్రమే మార్కులు తక్కువ రావు. ఫెయిల్ అయితే ఇక జీవితం ముగిసిపోయినట్టు భావించకూడదు. మీరు ఎన్ని మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యారో మొదట చూసుకోండి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి.

పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, మార్కులు తక్కువగా వచ్చాయనో తెలియగానే బాధగా అనిపించొచ్చు. ఒత్తిడి ఉండొచ్చు. కానీ ఒకసారి ఆలోచిస్తే మీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలరన్న నమ్మకం కలుగుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ బాధ నుంచి బయటపడటానికి కొంత సమయం తీసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకోండి. మీ నూరేళ్ల జీవితాన్ని ఒక్క పరీక్ష డిసైడ్ చేయదన్న విషయాన్ని తెలుసుకోండి. మీ ఒత్తిడి తగ్గకపోతే మీ తోబుట్టువులు, స్నేహితులతో మాట్లాడండి. లేదా మీ టీచర్‌తో చర్చించండి. కాబట్టి మళ్లీ మీ మార్కులను లెక్కించుకోవచ్చు. మరొకరి మార్కులతో మీ మార్కుల్ని పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి టాలెంట్ వారిది. మీ టాలెంటి మీది. సంప్రదాయ కోర్సులకు ధీటుగా ఇటీవల కొత్త కోర్సులు అనేకం వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, అనలిటిక్స్ లాంటి కొత్త కోర్సులకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది. అలాంటి కోర్సులు నేర్చుకుంటే మీ కెరీర్‌కు ఢోకా ఉండదు.

తల్లిదండ్రులు కూడా ఫెయిల్ అయిన తమ పిల్లలపై దృష్టి పెట్టాలి. ఎవరితో కలవకపోవడం, ఇంతకుముందులా ఉండకపోవడం, స్నేహితులను సైతం దూరం పెట్టడం లాంటివి మీరు గమనించినట్టైతే మీ పిల్లలు డిప్రెషన్‌లో ఉన్నారని గ్రహించాలి. వారితో మాట్లాడాలి. అవసరమైతే సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్‌ను కలవాలి.

ఇవి కూడా చదవండి:

TS Inter Results 2020: మొబైల్ యాప్‌లో ఇంటర్ ఫలితాలు... ఇలా చెక్ చేయండి

Career Guidance: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... చేయొచ్చు ఇలా

Courses After Inter: ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేయొచ్చు

Courses after Inter: ఇంటర్ తర్వాత ఈ 123 కోర్సులు చేయొచ్చు... విద్యార్థులకు సీబీఎస్ఈ సలహా
Published by: Santhosh Kumar S
First published: June 18, 2020, 3:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading