TS INTER RESULT 2022 UPDATES INTER 1ST YEAR AND 2ND YEAR RESULTS TODAY CHECK YOUR MARKS ON THESE WEBSITES MKS
TS Inter Result 2022 : తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు -న్యూస్ 18 వెబ్‌సైట్‌లోనూ నేరుగా..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడు
లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు (TS Inter Result 2022) విడుదలయ్యాయి. విద్యార్థులు న్యూస్ 18 తెలుగు వెబ్ సైట్ లో కూడా నేరుగా చూసుకోవచ్చు. వివరాలివే..
లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు (TS Inter Result 2022) వెల్లడయ్యాయి . తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను మంగళవారం నాడు ఒకేసారి ప్రకటించారు. తెలంగాణ ఇంటర్ బోర్డుతోపాటు న్యూస్ 18 తెలుగు వెబ్ సైట్ లోనూ విద్యార్థులు ఫలితాలను నేరుగా చూసుకోవచ్చు.
ఇవాళ (జూన్ 28, మంగళవారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియెట్ పరీక్షలు మే 24న ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను విద్యార్థులు న్యూస్ 18 తెలుగు వెబ్ సైట్ లో కూడా నేరుగా చూసుకోవచ్చు. ఏయే వెబ్ సైట్లలో ఫలితాలు చూడాలో, న్యూస్ 18లో ఫలితాల కోసం అనుసరించాల్సిన స్టెప్స్ ఏవంటే..
News18 Telugu వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చూసుకోవడం ఇలా.. Step 1- ముందుగా https://telugu.news18.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. Step 2- హోమ్ పేజీలో తెలంగాణ ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయండి. Step 3- హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. Step 4- స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి. Step 5- రిజల్ట్స్ కాపీని ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు.
బోర్డ్ వెబ్ సైట్లో ఇంటర్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు. Step 1: ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు మొదటగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in ను ఓపెన్ చేయాలి. Step 2: అనంతరం హోం పేజీలో ఇంటర్ రిజల్ట్స్ కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి. Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.