తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, వొకేషనల్ ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను ఇక్కడ చెక్ చేయండి.
తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/ తో పాటు http://results.cgg.gov.in, http://examresults.ts.nic.in వెబ్సైట్లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. వీటితో పాటు https://telugu.news18.com/ వెబ్సైట్లో కూడా ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/ వెబ్సైట్లో ఇంటర్ ఫలితాలను తెలుసుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి.
ముందుగా https://tsbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో ఇంటర్ ఫలితాలకు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్కు వేర్వేరు లింక్స్ ఉంటాయి. లింక్ క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఫలితాల కాపీని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.