హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Inter Exams: ఇంట‌ర్ విద్యార్థుల అల‌ర్ట్‌.. ప‌రీక్ష‌ల ఒత్తిడి అధిగ‌మించేందుకు ఉచిత కౌన్సెలింగ్‌

TS Inter Exams: ఇంట‌ర్ విద్యార్థుల అల‌ర్ట్‌.. ప‌రీక్ష‌ల ఒత్తిడి అధిగ‌మించేందుకు ఉచిత కౌన్సెలింగ్‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS Inter Exams 2022 | విద్యార్థుల‌ (Students)ను అత్యంత ఒత్తిడికి గురి చేసేది ప‌రీక్ష‌లు.. సాధారంగా చాలా మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు భ‌య‌ప‌డ‌తారు. నిత్యం క్లాసులు విని చ‌దివితేనే ప‌రీక్ష‌లంటే ఒత్తిడికి గుర‌య్యే విద్యార్థుల‌కు ఇంట‌ర్ బోర్డు ప్ర‌త్యేక ఏర్పాటు చేసింది.

ఇంకా చదవండి ...

విద్యార్థుల‌ (Students)ను అత్యంత ఒత్తిడికి గురి చేసేది ప‌రీక్ష‌లు.. సాధారంగా చాలా మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు భ‌య‌ప‌డ‌తారు. నిత్యం క్లాసులు విని చ‌దివితేనే ప‌రీక్ష‌లంటే ఒత్తిడికి గుర‌య్యే విద్యార్థుల‌కు క‌రోనా (Corona)తో మ‌రింత స‌మ‌స్య వ‌చ్చింది. స‌రిగా క్లాసులు కాక‌, ఆన్‌లైన్ క్లాసులు (Online Classes) అర్థం అవ్వ‌క‌పోవ‌డం ప‌రీక్ష‌లు పాస్ అయిన‌ట్టు ప్ర‌మోట్ చేశారు. దీంతో వారికి వారిమీద న‌మ్మ‌కం త‌గ్గి ప‌రీక్ష‌లంటే మ‌రింత భ‌యం ప్రారంభ‌మైంది.  ఈ నేపథ్యంలోనే త్వరలో  ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.  ఈ సమస్య పరిష్కారినికి  ఇంట‌ర్‌బోర్డు (Inter Board) స‌రికొత్త నిర్ణ‌యం తీసుకొంది. త్వరలో ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల స‌మ‌స్య‌ను దృష్టిలో పెట్టుకొని వారికి  సైకాల‌జిస్టు (Psychologist) స‌హాయాన్ని అందించాల‌ని బోర్డు నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి బోర్డు కార్య‌ద‌ర్శి ఒమ‌ర్ జ‌లీల‌ల్ తెలిపారు. ప‌రీక్ష‌ల స‌మ‌యంలో ఆందోళ‌న చెందే విద్యార్థులు వారి స‌మ‌స్య‌ల‌ను ఫోన్ ద్వారా సైకాల‌జిస్టుల‌కు చెప్పుకోవచ్చ‌ని తెలిపారు. ఇందుకోసం సైకాల‌జిస్టు ప్యాన‌ల్‌ను బోర్డు ఏర్పాటు చేసింది.

Job Mela: గుంటూరు నాగార్జున యూనివర్సిటిలో జాబ్ మేళా.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

ఈ ప్యాన‌ల్‌లో అనిత ఆరే - 91549 51704, శ్రీ‌ల‌త - 91549 51703, శైల‌జ పిశాపాటి - 91549 51706, అనుప‌మ - 91549 51687, ర‌జినీ తెనాలి - 91549 51695, మహజర్ ఆలీ - 91549 51977, జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ - 91549 516999 ఉన్నారు. ఈ నంబ‌ర్ల‌కు విద్యార్థులు ఫోన్ చేసి వారి స‌మ‌స్య‌ల‌ను వివ‌రించుకోవ‌చ్చు. స‌రైన ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని బోర్డు తెలిపింది.

తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board)  వెల్లడించిన వివరాల ప్రకారం మే   6 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ (TS Inter Exams) ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ముందుగానే ప్రకటించింది. ఆ తర్వాత జేఈఈ పరీక్షల తేదీలు వచ్చాయి. దీంతో తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలతో క్లాష్ కావడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్ష తేదీలను సవరించింది.

Jobs in AP: నెల్లూరులో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. ఎటువంటి ప‌రీక్ష లేకుండా ఎంపిక‌

ఏప్రిల్ 22 నుంచి మే 7 వరకు పరీక్షలు ఉంటాయని ప్రకటించింది. మళ్లీ జేఈఈ పరీక్షల తేదీలు మారాయి. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. ఈ తేదీలు తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలతో మళ్లీ క్లాష్ అవుతున్నాయి.

Jobs in Andhra Pradesh: ప‌లు జిల్లాల్లో ఉద్యోగ అవ‌కాశాలు.. ద‌ర‌ఖాస్తుకు రేప‌టితో ఆఖ‌రు తేదీ

తెలంగాణ ఇంటర్ పరీక్షలు, జేఈఈ ఎగ్జామ్స్ ఒకేసారి రావడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. దీంతో ఇంటర్ బోర్డు మరోసారి పరీక్ష తేదీలను మార్చక తప్పలేదు. మరోసారి తెలంగాణ ఇంటర్ బోర్డు రివైజ్డ్ షెడ్యూల్‍ను ప్రకటించింది. మార్చిన షెడ్యూల్ ప్రకారం మే 6 నుంచి మే 24 వరకు తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ ఇక్కడ చూడొచ్చు.

First published:

Tags: Exams, Intermediate exams, Telangana, Telangana intermediate board exams

ఉత్తమ కథలు