సేకరణ: పి.శ్రీనివాస్, న్యూస్18 కరస్పాండెంట్, కరీంనగర్
రచయిత: జె. పూజ కామర్స్ , లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ (గర్ల్స్)
ఇంటర్ రెండవ సంవత్సరం వాణిజ్యశాస్త్రం సిలబస్ మరియు ప్రశ్న పత్రాలతో ఇంటర్ బోర్డ్ సూచించిన మార్పులను విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించి దానిని అనుసరించి పరీక్షలకు సన్నద్ధం అయితే అప్పకుండా గరిష్ఠ మార్కులు పొందే అవకాశాలు వున్నాయి . విద్యార్థులు కరోనా కారణంగా కోల్పోయిన విలువైన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఇంటర్ బోర్డ్ సిలబస్ మరియు ప్రశ్న పత్రంలో సాధారణ విద్యార్థులు సైతం గరిష్ఠ మార్కులు సాధించేందుకు విద్యార్థులకు అనుకూలంగా భారీ మార్పులను చేసింది . ఏకంగా సిలబస్ లో 30 % తగ్గించి ప్రశ్న పత్రంలో ఎక్కువ ఛాయిస్ ని ఇవ్వటం జరిగింది .
వాణిజ్య శాస్త్రం ఉన్న ప్రశ్న పత్రంలో మొదటి విభాగం వాణిజ్యశాస్త్రం , రెండవ విభాగం వ్యాపార గణాంక శాస్త్రం . మొదటి భాగం 50 మార్కులు , రెండవ భాగం 50 మార్కులూగా విభజించబడింది .
ఈ విభాగంలో వాణిజ్య శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు వుంటాయి . ఇందులో A , B , C అను 3 Sections వుంటాయి . Section A లో 5 ప్రశ్నలకు రెండింటికి సమాధానం ( వ్రాయాలి ( 2 × 10 - 20 మార్క్స్ )
Section B లో 9 ప్రశ్నలకు ఏవేని 4 ప్రశ్నలకు సమాధానం వ్రాయతి (4 x5-20 .
Section C లో 11 ప్రశ్నలకు ఏవేని 5 ప్రశ్నలకు సమాధారం వ్రాయాలి . ( 5x2 = 10మార్క్స్ )
ఈ విభాగంలో వ్యాపార గణాంక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు వుంటాయి . ఇందులో D.E , F , G అను 4 Sections ఉంటాయి . Section D ' లో 4ప్రశ్నలు ఉంటాయి వీటిలో రెండింటికి సమాధానం రాయాలి 10×2= 20 మార్క్స్
section E లో మూడు ప్రశ్నలకు ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం వ్రాయాలి.10 మార్క్స్
section F లో ఏవేని 2ప్రశ్నలకు ప్రశ్నలకి సమాధానం వ్రాయాలి ( 10 మార్క్స్..)
Section G 6 ప్రశ్నలకు గాను ఏవేని 2ప్రశ్నలకి సమాధానం వ్రాయాలి .. (10మార్క్)
ఇంతకుముందు ప్రశ్నాపత్రంలో మొదటి భాగంలో సెక్షన్ A, 3 ప్రశ్నలకు ఏవేని 2కి వ సమాధానం వ్రాయాల్సి వుండేది .
రెండవ సంవత్సరం ప్రశ్నపత్రం మొదటి సంవత్సరం ప్రశ్నపత్రం మాదిరిగానే వుంటుంది . మొదటి భాగం సెక్షన్ A లో వాణిజ్యశాస్త్రం ( UNIT - I & II లలో 10 Marks సమాధానం రాసే అవకాశం వుంటుంది . రెండు ప్రశ్నలకు 20 Marks . వుంటుంది . వ్యాపార గణాంక శాస్త్రం లో UNIT - Il& lV చదివినట్లయితే 30 మార్కులు సాధించే అవకాశం వుంటుంది . వాణిజ్యశాస్త్రం, అపార గణాంక శాస్త్రం రెండు కలిపి 50 మార్కులు మంచి అవకాశం ఉంటుంది.
విద్యార్థులు పరీక్షలు రాసేటపుడు పెన్సిలిని ఉపయోగించి పట్టికలు , ప్రోఫార్మా , ఖాతాలు , చక్కగా రాసినట్లయితే , చక్కటి ఫలితాలు పొందే అవకాశం వుంటుంది . TO లు , By లు అన్ని పాటిస్తే Debit , Credit అయ్యే అంశాల పైన పట్టు సాధిస్తే వ్యాపార శాస్త్రంలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం వుంటుందని జె. పూజ ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్ కరీంనగర్ న్యూస్18 తెలుగు కీ తెలిపారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Intermediate exams, Telangana exams, Telangana inter board