ఇంటర్ ప్రశ్నాపత్రాలు గల్లంతు.. వెలుగుచూసిన మరో నిర్లక్ష్యం..

నీట్ ఎగ్జామ్‌లో టాపర్స్ వీరే

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచిన 13 సీల్డు బాక్సుల్లోని రెండు బాక్సులు గల్లంతయ్యాయి. గత రెండ్రోజులుగా పోలీసులు ప్రశ్నాపత్రాలున్న బాక్సుల కోసం గాలిస్తున్నారు. దీనిపై స్పందించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.

 • Share this:
  తెలంగాణలో ఇంటర్ ప్రశ్నాపత్రాలు గల్లంతయ్యాయి. ఈ నెల 7 నుంచే తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆ పరీక్షలకు సంబంధించిన పశ్నాపత్రాలు వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచిన 13 సీల్డు బాక్సుల్లోని రెండు బాక్సులు గల్లంతయ్యాయి. గత రెండ్రోజులుగా పోలీసులు ప్రశ్నాపత్రాలున్న బాక్సుల కోసం గాలిస్తున్నారు. దీనిపై స్పందించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.
  ఈ ఏడాది అడుగడుగునా ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఎగ్జామ్స్ నిర్వహణ దగ్గున్నుంచీ రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్ వరకూ అన్నింటిలోనూ నిర్లక్ష్యం వహించింది ఇంటర్‌బోర్డు. తాజాగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నాపత్రాల గల్లంతు అధికారుల అలసత్వానికి నిదర్శనంగా కనిపిస్తోందని పలువురు చెబుతున్నారు.

  ఇదిలా ఉండగా.. జూన్ 7 నుంచే తెలంగాణ వ్యాప్తంగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఎగ్జామ్స్‌కి 23,330 మంది హాజరుకానుండా.. ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించిన హాల్‌టికెట్స్ ఇంకా అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. పరీక్షలను అధికారులు వాయిదా వేసే యోచనలో ఉన్నారా అని పలువురు అనుమానిస్తున్నారు.

  ఇవి కూడా చదవండి..

  DOST Notification : ఇంటర్ విద్యార్థులకి గుడ్ న్యూస్.. దోస్త్ నోటిఫికేషన్ గడువు 
  First published: