హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Inter Sanskrit Syllabus: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సెకండియర్ సంస్కృత సిలబస్ ఇదే

TS Inter Sanskrit Syllabus: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సెకండియర్ సంస్కృత సిలబస్ ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష సంస్కృత ప్రశ్న పత్రం ఈ కింది విధంగా ఉంటుంది.

సేకరణ: పీ. శ్రీనివాస్, న్యూస్18తెలుగు కరస్పాండెంట్, కరీంనగర్

రచయిత: G. రవళి, లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్, కరీంనగర్

తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష సంస్కృత ప్రశ్న పత్రం ఈ కింది విధంగా ఉంటుంది. నూతనంగా ఉన్న ప్రశ్నాపత్రంలో మొదటి బిట్ నందు మూడు శ్లోకాలు ఇచ్చి ఏదేని ఒక శ్లోకానికి ప్రతిపదార్థ్యం రాయమంటారు. దీనికి 1 × 6 = 6 మార్కులు కేటాయించబడినవి . రెండవ బిట్ ( II ) నందు 3 వ్యాస - ఇంటర్ బోర్డు రూప సమాధాన ప్రశ్నలు ఇచ్చి ఏదేని ఒక ప్రశ్నకు సమాధానం రాయమందురు . దీనికి 1x6 = 6 మార్కులు కేటాయించబడినవి .

2 వ బిట్ లో గద్యభాగం ప్రశ్నలు ఇచ్చి ఏదేని నుండి 3 వ్యాసరూప ఒక ప్రశ్నకు సమాధానం మార్కులు రాయమాందురు . దీనికి 1x6 = 6

4 వ బిట్ ఉప వాచకం నుండి 4 ప్రశ్నలు ఇచ్చి ఏదేని రెండు . ప్రశ్నలకు సమాధానాలు రాయమందురు . ఒక ప్రశ్నకు 4 మార్కులు అనగా ఈ బిట్టుకు 2X4 = 8 మార్కులు కేటాయించబడినవి .

ప్రశ్న పత్రంలోని 5వ వ బిట్ నందు ఆ పత్రలేఖనానికి గాను 3 ప్రశ్నలలో ఏదేని ఒక సమాధానం రాయాలి . దీనికి 1x5 = 5 మార్కులు కేటాయించబడినవి .

ప్రశ్న పత్రంలోని Xll , XIIl బిట్లు సంధులకు సంబంధించినది . XII వ బిట్టులో 12 పదాలు ఇచ్చి వాటిలో , ఏవేని నాలుగు పదాలు విడదీసి సంధిపేరు రాయాల్సి ఉంటుంది . దీనికి గాను 2x408 మార్కులు కేటాయించ బడినవి . XIII బిట్ నందు 12 పదాలు విడదీసి ఇచ్చి వాటిలో నాలుగు పదాలు కలిపి రాసి , 20 సంధిపేరు రాయమందురు . దీనికి గాను 2X4 = 8 మార్కులు కేటాయించబడినవి . ప్రశ్నపత్రంలోని XVI వ బిట్ నందు ఐదు అశుద్ధమైన వాక్యాలు ఇచ్చి వాటిని 5 సరిచేసి రాయమందురు . దీనికి గాను మార్కులు కేటాయించబడినవి .

మొదటి బిట్ కొరకు పద్యభాగంలోని 3,4 పాఠాలలో ఏదేని ఒక పాఠంలోని నాలుగు శ్లోకాలకు ప్రతిపదార్థం నేర్చుకొన్నచో 6 మార్కులు , రెండవ బిట్ కొరకు పద్యభాగం లోని 2,6 పాఠాలలో ఏదేని ఒక పాఠంలోని వ్యాసరూప సమాధాన ప్రశ్న నేర్చుకున్నటైతే 6 మార్కులు , మూడవ బిట్ కొరకు గద్యభాగంలో 2'5 ఏదేని ఒక పాఠం నేర్చుకున్న ట్లైతే 6మార్కులు నాల్గవ బిట్ కొరకు ఉపవాచకంలోని 1,3 పాఠాలలో ఏదేని ఒక ప్రశ్న చదివినట్లయితే 8 మార్కులు,  పదకొండవ బిట్ ( xl) కొరకు పాఠ్యపుస్తకం లోని మూడు పత్రాలలో ఏదేని ఒక పత్రం నేర్చుకున్నట్లైతే 5 మార్కులు ఉంటాయి.

Xll మరియు Xlll కొరకు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ఐదు సంధులలో ఏవేని నాలుగు సంధులు నేర్చు 16 మార్కులు, XVI వ బిట్ కొరకు పాఠ్య పుస్తకంలోని 15 వాక్యాలు నేర్చుకున్నట్లైతే 5 మార్కులు సులభంగా సాధించవచ్చు . పై సూచనలను అనుసరించి విద్యార్థులు శ్రద్దగా చదువుతే..విద్యార్థులు సునాయాసంగా 52 మార్కులు సాధించగలరని G. రవళి. ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ కరీంనగర్ తెలిపారు...

First published:

Tags: Career and Courses, Exams, Telangana inter board, Telangana intermediate board exams, TS Inter Exams 2022

ఉత్తమ కథలు