రచయిత : ధర్మేందర్ సింగ్, విషయ నిపుణుడు
సేకరణ : కె. లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్
కరోనా నేపథ్యంలో చాలా రోజుల పాటు ఆఫ్ లైన్ క్లాసులు నిర్వహించకపోవడం, విద్యార్థులు ఒత్తిడిలో ఉండడం కారణంగా ప్రభుత్వం ఇంటర్ సిలబస్ ను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ సెకండియర్ మాథ్స్ సిలబస్ వివరాలు ఇలా ఉన్నాయి.
(Note:పేపర్-IIA లో క్రింద చూపించబడని అధ్యాయాలు 4,10 లలో నుండి మొత్తము అంశాలు ప్రశ్నపత్రం లోనికి పరిగణించబడతాయి. వీటి నుండి ఎలాంటి అంశాలు తొలగించబడ లేదు)
TS Inter 1st Year Syllabus: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి మాథ్స్ సిలబస్ ఇదే..
తొలగించబడిన అంశాలు
అధ్యాయం-1: సంకీర్ణ సంఖ్యలు:
1.3 సంకీర్ణ సంఖ్యామాపం, ఆయామం, దృష్టాంతాలు
1.4 సంకీర్ణ సంఖ్యను జ్యామితీయంగా ధ్రువ రూపంలో చిత్రించడం
అధ్యాయం-2: డి మోయర్ సిద్ధాంతం:
అభ్యాసం 2(b), సెక్షన్ II తో పాటు తరవాతి అన్ని
అధ్యాయం-3: వర్గ సమాసాలు:
3.3 వర్గ అసమీకరణాలు
అధ్యాయం-5: ప్రస్తారాలు- సంయోగాలు:
5.3 పునరావృతాన్ని అనుమతించిన ప్పుడు ప్రస్తారాలు
5.4 వృత్తాకార ప్రస్తారాలు
5.5 నియమబద్ధ పునరావృతాలున్న ప్రస్తారాలు, అభ్యాసం 5(e), సెక్షన్ III
అధ్యాయం-6: ద్విపద సిద్ధాంతం:
అభ్యాసం 6(a), సెక్షన్ II, 5 వ సమస్య మరియు తర్వాత అన్ని సమస్యలు, సంబంధిత ఉదాహరణలు
అభ్యాసం 6(b), సెక్షన్ II, మరియు తర్వాత అన్ని సమస్యలు, సంబంధిత ఉదాహరణలు
అభ్యాసం 6(c)
అధ్యాయం-7: పాక్షిక భిన్నాలు:
అభ్యాసం 7(d)
అధ్యాయం-8: విస్తరణ కొలతలు:
8.2.2 వర్గీకృత దత్తాంశానికి మధ్యమ విచలనం, అభ్యాసం 8(a), సెక్షన్ I, 3 వ సమస్య మరియు తర్వాత అన్ని సమస్యలు, సంబంధిత ఉదాహరణలు
TS SSC Physics Model Paper: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఫిజిక్స్ మోడల్ పేపర్ ఇదే..
II-B
(Note:పేపర్-IIB లో క్రింద చూపించబడని అధ్యాయాలు 1,2,7 మరియు 8 లలో నుండి మొత్తము అంశాలు ప్రశ్నపత్రం లోనికి పరిగణించబడతాయి. వీటి నుండి ఎలాంటి అంశాలు తొలగించబడ లేదు)
తొలగించబడిన అంశాలు
అధ్యాయం -3: పరావలయం:
3.2 పరావలయం పై ఒక బిందువు వద్ద స్పర్శ రేఖ, అభిలంబ రేఖ ల సమీకరణాలు.
అధ్యాయం -4: దీర్ఘ వృత్తం:
4.2 దీర్ఘ వృత్తం పై ఒక బిందువు వద్ద స్పర్శ రేఖ, అభిలంబ రేఖ ల సమీకరణాలు.
అధ్యాయం -4: అతిపరావలయం:
5.2 అతిపరావలయం పై ఒక బిందువు వద్ద స్పర్శ రేఖ, అభిలంబ రేఖ ల సమీకరణాలు. అభ్యాసం 5(a), సెక్షన్ II, మరియు తర్వాత అన్ని సమస్యలు, సంబంధిత ఉదాహరణలు
అధ్యాయం-6: సమాకలనం:
6.2(బి) విభాగ సమాకలనం, ఘాతిక, సంవర్గమాన, విలోమ త్రికోణమితీయ ప్రమేయాల సమాకలనం
అధ్యాయం -9: సంభావ్యత:
9.3.9 బేయీ సిద్ధాంతం మరియు సంబంధిత సమస్యలు
ప్రశ్నా పత్రం
మొత్తం 75 మార్కులు . సమయం :3 గం.
సెక్షన్ A (10X2=20మార్కులు)
మొత్తం 15 ప్రశ్నలు ఇవ్వబడుతాయి. 10 ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు
సెక్షన్ B (5X4=20 మార్కులు)
మొత్తం 12 ప్రశ్నలు ఇవ్వబడుతాయి. 5 ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాలి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు
సెక్షన్ C(5X7=35 మార్కులు)
మొత్తం 10 ప్రశ్నలు ఇవ్వబడుతాయి. 5 ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాలి. ప్రతి ప్రశ్నకు 7 మార్కులు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, Telangana inter board, Telangana intermediate board exams, TS Inter Exams 2022