TS INTER 2ND YEAR SYLLABUS KNOW ABOUT TELANGANA INTERMEDIATE 2ND YEAR ENGLISH SUBJECT SYLLABUS DETAILS HERE FULL DETAILS NS
TS Inter 2nd Year Syllabus: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి సెకండియర్ ఇంగ్లీష్ సిలబస్ ఇదే.. ఓ లుక్కేయండి
ప్రతీకాత్మక చిత్రం
ఈ సారి కోవిడ్ కారణంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వారికి 70% శాతం సిలబస్ ను మాత్రం పరిగణలోకి తీసుకొని బోధించారు. దీనికి అనుగుణంగా ప్రశ్నాపత్రాలను తయారు చేశారాని కరీంనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (సైన్స్) ఇంగ్లీష్ లెక్చరర్ కనకరాజు గారు తెలియజేశారు.
కరోనా చదుకునే పిల్లల జీవితాలను టోటల్ మార్చేసింది, విద్యార్థులను కళాశాలలకు దూరం చేసి సాంకేతికత తో ఆన్లైన్ చదువులు గా మార్చేసింది. ఐతే పిల్లలకు ఆన్లైన్ బోధన లో పిల్లల్లో నాణ్యత గల చదువు ఉన్నదా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది .ఐతే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) ఈ సారి కోవిడ్ కారణంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వారికి 70% శాతం సిలబస్ ను మాత్రం పరిగణలోకి తీసుకొని బోధించారు. దీనికి అనుగుణంగా ప్రశ్నాపత్రాలను తయారు చేశారాని కరీంనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (సైన్స్) ఇంగ్లీష్ లెక్చరర్ కనకరాజు గారు తెలియజేశారు. ఇంటర్మీడియట్ సిలబస్ (TS Inter Syllabus) ప్రకారం ఈ సంవత్సరం ఎగ్జామ్ పేపర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ క్రింద చూద్దాం.
ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం (TS Inter 2nd year syllabus) విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని సిలబస్ 30% కుదించారు. కేవలం 70 % మాత్రమే సిలబస్ ను పరీక్షా పత్రంలో ఇవ్వనున్నారు .మొత్తం 20 ప్రశ్నలకుగాను 3 విభాగాలుగా ఉండనున్నాయి. సబ్జెక్టుతో పాటు , ఆబ్జెక్టివ్ తరహా గత ప్రశ్నాపత్రము మాదిరిగానే ఉండనుంది . గత ప్రశ్నాపత్రంతో పోల్చితే SECTION - A లో అనగా Annotations and Answers లలో ఛాయిస్ల సంఖ్యను పెంచారు . సబ్జెక్ట్ లో poetry ,prose మరియు short stories లలో 5 గాను 4 చదవాలి . అంటే 70% సిలబస్ ను మాత్రమే చదవాలి. అదే విదంగా గ్రామర్ పార్ట్ లో అన్ని అంశాలు ఉన్నపటికీ కొన్ని అంశాలలో కొంతమేర తొలగించారు.దీని ఉద్దేశ్యము విద్యార్థికీ భాషలో పట్టుకోల్పోకుండా ఉండడానికి అన్ని అంశాలు జోడించారు.
ద్వితీయ సంవత్సర ప్రశ్నాపత్రం ఒకసారి పరిశీలిస్తే...
Subject నుండి 40 మార్కులు ( SECTION - A ) , Reading comprehension నుండి 8 మార్కులు ఉంటాయి , Grammar part లో 52 మార్కులు ఉంటాయి.
SECTION- A లో Annotations, Answers prose మరియు poetry నుండి వస్తాయి.
1వ ప్రశ్నలో లో poetry నుండి నుండి 5 గాను, 2 Annotations.
2వ ప్రశ్నలో prose నుండి 5 గాను 2, Annotations.
3వ,ప్రశ్నలో poetry నుండి 5 గాను 2 Answers.
4 వ ప్రశ్నలో proseనుండి 5 గాను 2 Answers
5వ ప్రశ్నలో 5 -గాను 2 Answers ను short stories నుండి వ్రాయాలి.
SECTON - B comprehensive passage
6 వ ప్రశ్న క్రింద short story.
7 వ ప్రశ్న క్రింద Text Bookలోని passages చదివి వ్రాయాలి.
8 వ ప్రశ్న క్రింద advisement.
9వ ప్రశ్న క్రింద నాన్ వర్బ్ డేటా అనగా పై చాట్,బారాగ్రాప్, లాంటివి ఇస్తే వాటిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయాలి.
Section C
10 వ ప్రశ్న క్రింద punctuation marks ను గుర్తించి వ్రాయాలి.
11వ ప్రశ్నకు matching ఉంటుంది. ఇవి దాదాపు గా text బుక్ లోని Glossary నుండి వచ్చే అవకాశం ఉంది.
12 వ ప్రశ్న కింద ఇచ్చిన idiom లేక phrase ను ఉపయోగించి సొంత వాక్యాలలో రాయాలి.
13వ ప్రశ్నకు ఇచ్చిన verb pattern కు 4ఉదాహరణలు వ్రాయాలి.
14వ ప్రశ్నకు form filling ఉంటుంది. ఇచ్చిన నెంబర్ లో వచ్చే సరైన సమాధానంతో వాటిని పూరించాలి.
15 ప్రశ్నకు ఇచ్చిన advisement కు సరిపోయే curriculum vitae వ్రాయాలి.
16 వ ప్రశ్నకు క్రింద describing a process మూడింటిగాను ఏదయినా ఒకదానికి ల వ్రాయాలి.
17వ ప్రశ్నకు Letter Writing ఉంటుంది మూడింటిగాను ఏదైనా ఒకదానికి letter వ్రాయాలి.
18వ ప్రశ్నకు ఇచ్చిన peragrph, peragraphs కి ఒక సరైన title ను సూచించి ముఖ్యంశాలు అనగా Note Making రాయాలి.
19 వ ప్రశ్నకు 10పదాలు ఇస్తారు. అపదాలలో వచ్చే stress ను గుర్తించి రాయాలి.
20వ ప్రశ్నకు మూడింటిలో ఏదయినా ఒకదానికి Dialouge Writing వ్రాయాలి.
ఇలా తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ ఈ విధంగా ఉండబోతుంది. విద్యార్థులు ఎప్పటికప్పుడు చదువుతూ తెలంగాణ ఇంటర్ బోర్డు వారు ఇటీవల విడుదల చేసిన నమూనా ప్రశ్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, చదివితే చాలా మేలు జరుగుతుంది . కరోనా పరిస్థితుల వలన కుదించిన సిలబస్ ప్రకారం చదువుకుంటే మంచి మార్కులు రాబట్ట వచ్చని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ కనకరాజు న్యూస్18 తెలుగుకు తెలిపారు.
Disclaimer: పైన ఇచ్చిన వివరాలు విద్యార్థులకు అవగాహన కోసం మాత్రమే. పరీక్షల సిలబస్, మోడల్ పేపర్స్ లాంటి వివరాల కోసం విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/ ఫాలో కావాలి.
రచయిత: కనకరాజు, ఇంగ్లీష్ లెక్చరర్, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల, కరీంనగర్
సేకరణ: శ్రీనివాస్.పి, న్యూస్ 18 కరస్పాండెంట్, కరీంనగర్ జిల్లా
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.