సేకరణ: శ్రీనివాస్.పీ, న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్, కరీంనగర్
కరోనా (Corona) మహమ్మారి చదుకునే పిల్లల జీవితాలను టోటల్ గా మార్చేసింది. విద్యార్తులను కళాశాలలకు దూరం చేసి సాంకేతికత తో ఆన్లైన్ చదువులుగా మార్చేసింది. ఐతే పిల్లలకు ఆన్లైన్ బోధన లో పిల్లల్లో నాణ్యత గల చదువు ఉన్నదా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది .ఐతే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఇంటర్ బోర్డు (TS Inter Board) వారు ఈ సారి కోవిడ్ కారణంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వారికి 70% శాతం సిలబస్ ను మాత్రం పరిగణలోకి తీసుకొని మోడల్ పేపర్ ను రూపొందించారు. ఇంటర్మీడియట్ సిలబస్ ప్రకారం ఈ సంవత్సరం ఎగ్జామ్ మోడల్ పేపర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ క్రింద చూద్దాం. విద్యార్ధులను (Students) దృష్టిలో పెట్టుకుని సిలబస్ 30% కుదించారు . కేవలం 70 % మాత్రమే సిలబస్ను పరీక్షా పత్రంలో ఇవ్వనున్నారు .మొత్తం 20 ప్రశ్నలకుగాను 3 విభాగాలుగా ఉండనున్నాయి. 2)సబ్జెక్టుతో పాటు , ఆబ్జెక్టివ్ తరహా గత ప్రశ్నాపత్రము మాదిరిగానే ఉండనుంది . గత ప్రశ్నాపత్రంతో పోల్చితే SECTION - A లో అనగా Annotations and Answers లలో ఛాయిస్ల సంఖ్యను పెంచారు.
సబ్జెక్ట్ లో poetry ,prose మరియు short stories లలో 5 గాను 4 చదవాలి . అంటే 70% సిలబస్ ను మాత్రమే చదవాలి. అదే విదంగా గ్రామర్ పార్ట్ లో అన్ని అంశాలు ఉన్నపటికీ కొన్ని అంశాలలో కొంతమేరతొలగించారు.దీని ఉద్దేశ్యము విద్యార్థికీ భాషలో పట్టుకోల్పోకుండా ఉండడానికి అన్ని అంశాలు జోడించారు. Subject నుండి 40 మార్కులు ( SECTION - A ) , Reading comprehension నుండి 8 మార్కులు ఉంటాయి , Grammar part లో 52 మార్కులు ఉంటాయి.
Inter Exams: తెలంగాణ, ఏపీలో మళ్లీ మారనున్న ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలు.. ఎందుకంటే?
పరీక్షా పత్రంలో SECTION- A లో Annotations, Answers prose మరియు poetry నుండి వస్తాయి . 1వ ప్రశ్నలో లో poetry నుండి నుండి 5గాను, 2 Annotations ,2వ ప్రశ్నలో prose నుండి 5గాను 2, Annotations మరియు 3వ,ప్రశ్నలో poetry నుండి 5గాను2 Answers,4 వ ప్రశ్నలో proseనుండి 5 గాను 2Answers, 5వ ప్రశ్నలో 5 -గాను 2 Answersను short stories నుండి వ్రాయాలి.
TS Inter Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సెకండియర్ కామర్స్ సిలబస్ ఇదే..
SECTON - B లో comprehensive passage 6 వ ప్రశ్న క్రింద short story నుండి మరియు 7 వ ప్రశ్న క్రింద Text Bookలోని passages చదివి వ్రాయాలి .8 వ ప్రశ్న క్రింద advisement . 9వ ప్రశ్న క్రింద నాన్ వర్బ్ డేటా అనగా పై చాట్,బారాగ్రాప్, లాంటివి ఇస్తే వాటిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయాలి.
సెక్షన్ C..లో 10 వ ప్రశ్న క్రింద కు ఫంక్షన్ మార్క్స్ ను గుర్తించి వ్రాయాలి.
11వ ప్రశ్నకు matching ఉంటుంది. ఇవి దాదాపు గా text బుక్ లోని glossary నుండి వచ్చే అవకాశం ఉంది.12 వ ప్రశ్న కింద ఇచ్చినidiom phrase ను ఉపయోగించి సొంత వాక్యాలలో రాయాలి.13వ ప్రశ్నకు ఇచ్చినverb pattern కు 4ఉదాహరణలు వ్రాయాలి.14వ ప్రశ్నకు form filling ఉంటది.
ఇచ్చిన నెంబర్ లో ఉండేవాటిని పూరించాలి.15 ప్రశ్నకు ఇచ్చిన advisement కు సరిపోయే curriculum vitae రాయాలి. 16 వ ప్రశ్నకు క్రింద describing ఏprocessమూడింటిగాను ఏదయినా ఒకదానికి లెటర్ వ్రాయాలి.17వ ప్రశ్నకు లెటర్ రైటింగ్ ఉంటుంది మూడింటిగాను ఏదైనా ఒకదానికి letter రాయాలి.18వ ప్రశ్నకు ఇచ్చిన paragraphs, paragraphs కి ఒక సరైన title ను సూచించి ముఖ్యంశాలు అనగా note making రాయాలి. 19 వ ప్రశ్నకు 10పదాలు ఇస్తారు. అపదాలలో వచ్చే stress ను గుర్తించి రాయాలి.20వ ప్రశ్నకు మూడింటిలో ఏదయినా ఒకదానికి dialogue writing రాయాలి.
ఇలా ద్వితీయ సంవత్సరం మోడల్ పేపర్స్ ఈవిదంగా ఉండబోతుంది. విద్యార్థులు ఎప్పటికప్పుడు చదువుతూ తెలంగాణ ఇంటర్ బోర్డు వారు ఇటీవల విడుదల చేసిన నమూనా ప్రశ్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి , చదివితే చాలా మేలు జరుగుతుంది . కరోనా పరిస్థితుల వలన కుదించిన సిలబస్ ప్రకారం చదువుకుంటే మంచి మార్కులు రాబట్ట వచ్చని ప్రభుత్వ ఇంటర్ మీడియట్..ఇంగ్లీష్ లెక్చరర్ కనకరాజు సార్, న్యూస్18 తెలుగు కు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.