రచయిత : ధర్మేందర్ సింగ్, సబ్జెక్ట్ నిపుణులు
సేకరణ : కే. లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్ సిలబస్ ను తెలంగాణ ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, ఇంటర్ సిలబస్ నుంచి ఈ సారి ఈ కింది అంశాలు పబ్లిక్ పరీక్షల పేపర్లలో పరిగణించబడవు.
ఇంటర్మీడియట్ (ప్రథమ సంవత్సరం)
I-A
(Note:పేపర్-IA లో కింద తెలపని అధ్యాయాలు 4,6 లలో నుండి మొత్తము అంశాలు ప్రశ్నపత్రం లోనికి పరిగణించబడతాయి. వీటి నుండి ఎలాంటి అంశాలు తొలగించబడ లేదు)
తొలగించబడిన అంశాలు
అధ్యాయం-1: ప్రమేయాలు:
1.2. విలోమ ప్రమేయాలు & వాటికి సంబంధించిన సిద్ధాంతాలు
అధ్యాయం -2: గణితానుగమనం:
మొత్తం అధ్యాయం
అధ్యాయం -3: మాత్రికలు:
3.4.8. నిర్ధారకాల ధర్మాలు మరియు వాటికి సంబంధించిన ఉదాహరణలు, సమస్యలు.
3.6. ఏక కాల రేఖీయ సమీకరణాల సంగతత్వం, అసంగతత్వం
3.7 గాస్ - జోర్డాన్ పద్ధతి
3.7.7 తో పాటు తర్వాత అన్ని
అధ్యాయం-5: సదిశల లబ్దం:
5.11. ఒక తలం యొక్క సదిశా సమీకరణం, వివిధ రూపాలు, అతలీయ రేఖలు (skew lines), అతలీయ రేఖల మధ్య లంబ దూరం, సరళ రేఖలు సతలీయాలు కావడానికి నియమం.
5.12. సదిశా త్రిక లబ్దం మరియు వాటి ఫలితాలు
అధ్యాయం -7: త్రికోణ మితీయ సమీకరణాలు:
మొత్తం అధ్యాయం
అధ్యాయం -8: విలోమ త్రికోణ మితీయ ప్రమేయాలు:మొత్తం అధ్యాయం
అధ్యాయం -9: అతి పరావలయ ప్రమెయాలు:
9.2 విలోమ అతి పరావలయ ప్రమెయాలు మరియు గ్రాఫ్ లు.
I-B
(Note:పేపర్-IB లో కింద చూపించబడని అధ్యాయాలు 1,2,3,5 మరియు 6 లలో నుండి మొత్తము అంశాలు ప్రశ్నపత్రం లోనికి పరిగణించబడతాయి. వీటి నుండి ఎలాంటి అంశాలు తొలగించబడ లేదు)
తొలగించబడిన అంశాలు
అధ్యాయం -4: సరళ రేఖా యుగ్మాలు:
4.3 సరళ రేఖల మధ్య కోణాల సమద్విఖండన రేఖాయుగ్మం, అభ్యాసం 4(a) మరియు సంబంధిత సమస్యలు
4.5 సమాంతర రేఖలవడానికి నియమాలు, వాటి మధ్య లంబ దూరం, రేఖా యుగ్మ ఖండన బిందువు, అభ్యాసం 4(b)
అధ్యాయం -7: సమతలం :
అభ్యాసం 7(a) సెక్షన్ II & III సంబంధిత సమస్యలు
అధ్యాయం -8: అవధులు, అవిచ్ఛిన్నత:
8.4 అవిచ్చిన్నత
అధ్యాయం -9: అవకలనం :
9.3 విలోమ త్రికోణ మితీయ ప్రమేయాలు అవకలనాలు, అభ్యాసం 9(c) సెక్షన్ III సంబంధిత సమస్యలు, అభ్యాసం 9(d)
అధ్యాయం 10: అవకలజాల అనువర్తనాలు:
10.6 మార్పు రేటు గా అవకలనం
10.7 రోలే సిద్ధాంతం, లెగ్రాంజీ మధ్యమ మూల్య సిద్ధాంతం
10.8 ఆరోహణ, అవరోహణ ప్రమేయాలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, Telangana inter board, Telangana intermediate board exams, TS Inter Exams 2022