హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Inter 1St Year Economics Paper: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి ఎకనామిక్స్ పేపర్ ఇలా

TS Inter 1St Year Economics Paper: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి ఎకనామిక్స్ పేపర్ ఇలా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రథమ సంవత్సరం (TS Inter First Year) అర్థశాస్త్రం వార్షిక మోడల్ పరీక్ష పేపర్ (Exam Model Paper) ను మూడు భాగాలుగా విభజించారు. భాగం - A లో వ్యాసరూప, భాగం -Bలో స్వల్ప సమాధాన, భాగం -C  లో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి.

సేకరణ: పీ. శ్రీనివాస్, న్యూస్ 18 కరస్పాండెంట్, కరీంనగర్

రచయిత: ch. శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్

విద్యార్థులకు కరోనా (Corona) మహమ్మారి వల్ల జరిగిన నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎగ్జామ్స్ (Exams) లో ఛాయిస్ ని 30 శాతాన్ని తగ్గించి 70 శాతం మేరకు ప్రశ్నలకు  తెలంగాణ ఇంటర్ బోర్డు (TS Inter Board) రూపొందించనుంది. దీని వల్ల విద్యార్థులు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించేందుకు తగిన అన్ని చర్యలను తీసుకున్నది. ప్రథమ సంవత్సరం అర్థశాస్త్రం వార్షిక మోడల్ పరీక్ష పేపర్ ను మూడు భాగాలుగా విభజించారు. భాగం - A లో వ్యాసరూప , భాగం -Bలో స్వల్ప సమాధాన మరియ భాగం -C  లో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు ఇవ్వడం జరిగింది. పార్ట్ A ఈ విభాగంలో ప్రశ్నల ఛాయిస్ ను 5 నుండి 7 ప్రశ్నలకు పెంచింది . ఇందులో విద్యార్థులు తమకు నచ్చిన ఏవేని మూడింటికి సమాధానం వ్రాయవలసి ఉంటుంది . ప్రతి ప్రశ్నకు 10 మార్కులు . యూనిట్- I నుండి మరియు యానిట్ - 4 నుండి రెండేసి మరియు యూనిట్- lI , lll మరియు 9 నుండి ఒక్కొక్కటి వ్యాసరూప ప్రశ్నలు అడుగుతారు . ఇందులో విద్యార్థులు తప్పకుండా రాయవలసిన 3 ప్రశ్నల కోసం యూనిట్- I మరియు యూనిట్ lV క్షుణ్ణంగా చదివితే సరిపోతుంది.

ఈ విభాగం కోసం ఆర్థిక వృద్ధి , ఆర్థికాభివృ , అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు , భారత వ్యవసాయ రంగ ప్రాధాన్యత , అల్ప ఉత్పాదకత , హరిత విప్లవం మరియు వ్యవసాయ మార్కెటింగ్ లోపాలకు సంబంధించి మంచి పట్టును సాధిస్తే కనీసం 30 నుంచి 36 మార్కుల వరకు సాధించే అవకాశం ఉంటుంది. పార్ట్ - బి ఈ విభాగంలో చాయిస్ను 12 నుండి 16 వరకు పెంచారు.. మొత్తం ప్రశ్నలకు సమాధానం వ్రాయవలసి ఉంటుంది . ఎందుకంటే అంటే ఇందులో 50 శాతం మేరకు చాయిస్ పెంచడం వల్ల విద్యార్థులకు సమాధానాలు రాయడం సులభతరం అవుతుంది.

TS Inter 1st Year English Model Paper: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ మోడల్ పేపర్ ఇదే..

ఈ విభాగంలో  యూనిట్ -l ' Vl ,మరియు Vlll, IX నుండి రెండేసి ప్రశ్నలు మరియు  యూనిట్- I ,VI , VIll  మరియు  నుండి ఒక్కొక్కటి స్వల్పగా మాధాన ప్రశ్నలు అడుగుతారు . ఇందులో 16 నుండి 8 ప్రశ్నలను ఎంచుకొని , సమాధానం రాయవలసి ఉంటుంది . దీనికిగాను యూనిట్ lll  , lV , V, మరియు Vl, యూనిట్లను చదివినట్లయితే 8 ప్రశ్నలను వ్రాయవచ్చు . దీనికి గాను జాతీయ ఆదాయం , పేదరికం , నిరుద్యోగిత , నీతి ఆయోగ్ , వ్యవసాయరంగం - ప్రాధాన్యత , సమస్యలు , ఆర్థిక సంస్కరణలు , డీ మానిటీస్టేషన్ , GST మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంబంధించి తెలుగు అకాడమీ , ప్రతమ సంవత్సరం అర్థశాస్త్రం పుస్తకంలో ఈ యూనిట్ల  చదివితే సులభంగా 36 నుండి 38 మార్కులు వరకు సాధించవచ్చు.

AP Inter 1st Year Civics: ఏపీ విద్యార్థుల‌కు ప్ర‌త్యేకం.. ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ సివిక్స్ సిలబస్ ఇదే

పార్ట్ సి...

ఈ భాగం నుంచి విద్యార్థులు 25 ప్రశ్నల నుండి ఒక ప్రశ్నలకు సమాధానం వ్రాయవలసి ఉంటుంది . ఒక్కొక్క ప్రశ్నలు 2 మార్కులు కేటాయించారు. ఇంతకు ముందు 20, ప్రశ్నల నుండి మాత్రమే ఎంచుకునేలా ఉంటుంది. మారిన ప్రశ్నాపత్రం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు గరిష్ఠ మార్కులు సాధించేందుంకు దోహదపడే అవకాశం ఉంది.

పార్ట్ - సి..

నుండి మంచి మార్కులు సాధించేందుకు యూనిట్ lll, V, Vlll మరియు Xలను క్షుణ్ణంగా చదివితే 14 ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం వ్రాయవచ్చు . మిగిలిన మార్కులకు మిగతా యూనిట్లలోని ముఖ్యమైన ప్రశ్నలను చదివితే సరిపోతుంది.అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకోసం తెలుగు అకాడమీ మొదటి సంవత్సరం అర్థశాస్త్రం పుస్తకంలో యూనిట్లను ముఖ్యమైన వివరణ ఇచ్చిన ప్రశ్నలతో పాటు, ఇంతకు ముందు జరిగిన వార్షిక పరీక్ష పేపర్ నుండి ప్రశ్నలను సేకరించి , వాటిపై పట్టుసాధినీ తప్పకుండా విద్యార్థులు మంచి మార్కుల వరకు సాధించగలుగుతారని డాక్టర్ ch. శ్రీనివాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యూస్ 18 కి తెలిపారు..

First published:

Tags: Career and Courses, Exams, Telangana inter board, Telangana intermediate board exams, TS Inter Exams 2022

ఉత్తమ కథలు