హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS INTER 1ST YEAR COMMARCE: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. కామర్స్ మోడల్ పేపర్ ఇదే.. డౌన్ లోడ్ చేసుకోండి

TS INTER 1ST YEAR COMMARCE: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. కామర్స్ మోడల్ పేపర్ ఇదే.. డౌన్ లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్ మొదటి సంవత్సరం వాణిజ్యశాస్త్రం ప్రశ్న పత్రాలతో పాటు ఇంటర్ బోర్డ్ సూచించిన మార్పులను విద్యార్థులు క్షుణ్ణంగా  పరిశీలించి దానిని అనుసరించి పరీక్షలకు సన్నద్ధం అయితే అప్పకుండా గరిష్ఠ మార్కులు పొందే అవకాశాలు ఉన్నాయి .

సేకరణ: పి. శ్రీనివాస్, న్యూస్18 ప్రతినిధి, కరీంనగర్

రచయిత: జే. పూజ, కామర్స్ లెక్చరర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ

ఇంటర్ మొదటి సంవత్సరం వాణిజ్యశాస్త్రం ప్రశ్న పత్రాలతో పాటు ఇంటర్ బోర్డ్ సూచించిన మార్పులను విద్యార్థులు క్షుణ్ణంగా  పరిశీలించి దానిని అనుసరించి పరీక్షలకు సన్నద్ధం అయితే అప్పకుండా గరిష్ఠ మార్కులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్థులు కరోనా కారణంగా కోల్పోయిన విలువైన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని  తెలంగాణ ఇంటర్ బోర్డ్ 70% సిలబస్ ను తీసుకోని మోడల్ పేపర్ తయారు చేసారు.మరియు ప్రశ్న పత్రంలో సాధారణ విద్యార్థులు సైతం గరిష్ఠ మార్కులు సాధించేందుకు విద్యార్థులకు అనుకూలంగా భారీ మార్పులను చేసింది . ఏకంగా సిలబస్ లో 30 % తగ్గించి ప్రశ్న పత్రంలో ఎక్కువ ఛాయిస్ ని ఇవ్వటం జరిగింది . వాణిజ్య శాస్త్రం ఉన్న ప్రశ్న పత్రంలో  మొదటి విభాగం వాణిజ్యశాస్త్రం , రెండవ విభాగం వ్యాపార గణాంక  శాస్త్రం . మొదటి భాగం 50 మార్కులు , రెండవ భాగం 50 మార్కులూగా విభజించబడింది .

Part 1:

ఈ విభాగంలో వాణిజ్య శాస్త్రానికి  సంబంధించిన ప్రశ్నలు వుంటాయి . ఇందులో A , B , C అను 3 Sections వుంటాయి . Section A లో 5 ప్రశ్నలకు రెండింటికి సమాధానం ( వ్రాయాలి ( 2 × 10 - 20 మార్క్స్ )

Section B లో 9 ప్రశ్నలకు ఏవేని 4 ప్రశ్నలకు సమాధానం వ్రాయతి (4 x5-20 .

Section C లో 11 ప్రశ్నలకు ఏవేని 5 ప్రశ్నలకు సమాధారం వ్రాయాలి . ( 5x2 = 10మార్క్స్ )

Part 2 ఈ విభాగంలో వ్యాపార గణాంక శాస్త్రానికి  సంబంధించిన ప్రశ్నలు వుంటాయి . ఇందులో D.E , F , G అను 4 Sections ఉంటాయి .  Section D ' లో తప్పునిసరి ( ప్రశ్న ( 20 మార్క్స్ కు సమాధానం రాయాలి. 20మార్క్స్

section E లో మూడు ప్రశ్నలకు ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం వ్రాయాలి.10 మార్క్స్

section F లో ఏవేని  2ప్రశ్నలకు  ప్రశ్నలకి సమాధానం వ్రాయాలి ( 10 మార్క్స్..)

Section G 6 ప్రశ్నలకు గాను ఏవేని 2ప్రశ్నలకి సమాధానం వ్రాయాలి .. (10మార్క్స్)ఇంతకుముందు ప్రశ్నాపత్రంలో మొదటి భాగంలో సెక్షన్ A , 3 ప్రశ్నలకు ఏవేని 2 కి వ సమాధానం వ్రాయాల్సి వుండేది . Section B 6 ప్రశ్నలకు ఏవేని 4 ప్రశ్నలకు సమాధానం వ్రాయాలి . - Section - c లో ఏవేని 8 ప్రశ్నలకు ఏవేని 5 సమాధానం రాయాల్సివుండేది . రెండవ భాగం లేని సెక్షన్ డ్ .

యధావిధిగా , సెక్షన్ E లో రెండిటికి ఒకదానికి , సెక్షన్ f లో నాలుగింటిలో రెండు , సెక్షన్ G లో 8 ప్రశ్నలకు ఐదింటికి సమాధానం రాయవలసి వుండేవి . ఇప్పుడు చాయిస్ ప్రశ్నలను పెంచడం విద్యార్థులకు కలిసివచ్చే అంశం . Part 1 .. Section A లో మార్కుల కొరకు UNIT - 11 & 111 చక్కగా చదివినట్లయితే , Sec B లో మార్కులు కొరకు లో , I , IV , V సెక్షన్ A లో 20 Marks : Sections B లో Marky 40 సాధించగలుగుతారు . Part 2 ; సెక్షన్ D లో ముగింపు లెక్కలు బాగా Practice చేసినట్లైతే 20 మార్క్స్ సాధించే అవకాశం ఉంది.

అదే విధంగా section ఈ లో నగదు పుస్తకం , లేదా బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టిన Practice చేసినట్లయితే 10 Marks మొత్తం 30 Marks సాధించ కలుగుతారు .మొత్తంగా వాణిజ్య శాస్త్రంలో యూనిట్ II , అండ్ ॥॥ మరియు వ్యాపార గణాంక శాస్త్రంలో ముగింపు లెక్కలు మరియు నగదు పుస్తకం లేదా బ్యాంకు నిల్వల సమన్వయపట్టి చదివినట్లయితే విద్యార్థులు 50 మార్క్స్ సాధించే అవకాశం వుందని న్యూస్ 18 తెలుగు కి జె. పూజ కామర్స్ , లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ( గర్ల్స్) తెలిపారు .

First published:

Tags: Career and Courses, Exams, Telangana inter board, Telangana intermediate board exams, TS Inter Exams 2022

ఉత్తమ కథలు