Home /News /jobs /

TS INTER 1ST YEAR SYLLABUS HERE IMPORTANT DETAILS ABOUT TELANGANA INTERMEDIATE 1ST YEAR MATHEMATICS SUBJECT SYLLABUS DETAILS HERE NS ADB

TS Inter 1st Year Syllabus: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి మాథ్స్ సిలబస్ ఇదే.. ఓ లుక్కేయండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కరోనా(Corona) నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్ సిలబస్(TS Inter Syllabus) ను ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, ఇంటర్ సిలబస్ నుంచి ఈ సారి ఈ కింది అంశాలు పబ్లిక్ పరీక్షల పేపర్లలో పరిగణించబడవు.కరోనా(Corona) నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్ సిలబస్(TS Inter Syllabus) ను ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, ఇంటర్ సిలబస్ నుంచి ఈ సారి ఈ కింది అంశాలు పబ్లిక్ పరీక్షల పేపర్లలో పరిగణించబడవు.

ఇంకా చదవండి ...
    రచయిత : ధర్మేందర్ సింగ్, సబ్జెక్ట్ నిపుణులు
    సేకరణ : కే. లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ 

    కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్ సిలబస్ ను తెలంగాణ ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, ఇంటర్ సిలబస్ నుంచి ఈ సారి ఈ కింది అంశాలు పబ్లిక్ పరీక్షల పేపర్లలో పరిగణించబడవు.

    ఇంటర్మీడియట్ (ప్రథమ సంవత్సరం)
    I-A
    (Note:పేపర్-IA లో కింద తెలపని అధ్యాయాలు 4,6 లలో నుండి మొత్తము అంశాలు ప్రశ్నపత్రం లోనికి పరిగణించబడతాయి. వీటి నుండి ఎలాంటి అంశాలు తొలగించబడ లేదు)
    తొలగించబడిన అంశాలు
    అధ్యాయం-1: ప్రమేయాలు:
    1.2. విలోమ ప్రమేయాలు & వాటికి సంబంధించిన సిద్ధాంతాలు
    అధ్యాయం -2: గణితానుగమనం:
    మొత్తం అధ్యాయం
    అధ్యాయం -3: మాత్రికలు:
    3.4.8. నిర్ధారకాల ధర్మాలు మరియు వాటికి సంబంధించిన ఉదాహరణలు, సమస్యలు.
    3.6. ఏక కాల రేఖీయ సమీకరణాల సంగతత్వం, అసంగతత్వం
    3.7 గాస్ - జోర్డాన్ పద్ధతి
    3.7.7 తో పాటు తర్వాత అన్ని
    అధ్యాయం-5: సదిశల లబ్దం:
    5.11. ఒక తలం యొక్క సదిశా సమీకరణం, వివిధ రూపాలు, అతలీయ రేఖలు (skew lines), అతలీయ రేఖల మధ్య లంబ దూరం, సరళ రేఖలు సతలీయాలు కావడానికి నియమం.
    5.12. సదిశా త్రిక లబ్దం మరియు వాటి ఫలితాలు
    అధ్యాయం -7: త్రికోణ మితీయ సమీకరణాలు:
    మొత్తం అధ్యాయం
    అధ్యాయం -8: విలోమ త్రికోణ మితీయ ప్రమేయాలు:మొత్తం అధ్యాయం
    అధ్యాయం -9: అతి పరావలయ ప్రమెయాలు:
    9.2 విలోమ అతి పరావలయ ప్రమెయాలు మరియు గ్రాఫ్ లు.

    I-B
    (Note:పేపర్-IB లో కింద చూపించబడని అధ్యాయాలు 1,2,3,5 మరియు 6 లలో నుండి మొత్తము అంశాలు ప్రశ్నపత్రం లోనికి పరిగణించబడతాయి. వీటి నుండి ఎలాంటి అంశాలు తొలగించబడ లేదు)
    తొలగించబడిన అంశాలు
    అధ్యాయం -4: సరళ రేఖా యుగ్మాలు:
    4.3 సరళ రేఖల మధ్య కోణాల సమద్విఖండన రేఖాయుగ్మం, అభ్యాసం 4(a) మరియు సంబంధిత సమస్యలు
    4.5 సమాంతర రేఖలవడానికి నియమాలు, వాటి మధ్య లంబ దూరం, రేఖా యుగ్మ ఖండన బిందువు, అభ్యాసం 4(b)
    అధ్యాయం -7: సమతలం :
    అభ్యాసం 7(a) సెక్షన్ II & III సంబంధిత సమస్యలు
    అధ్యాయం -8: అవధులు, అవిచ్ఛిన్నత:
    8.4 అవిచ్చిన్నత
    అధ్యాయం -9: అవకలనం :
    9.3 విలోమ త్రికోణ మితీయ ప్రమేయాలు అవకలనాలు, అభ్యాసం 9(c) సెక్షన్ III సంబంధిత సమస్యలు, అభ్యాసం 9(d)
    అధ్యాయం 10: అవకలజాల అనువర్తనాలు:
    10.6 మార్పు రేటు గా అవకలనం
    10.7 రోలే సిద్ధాంతం, లెగ్రాంజీ మధ్యమ మూల్య సిద్ధాంతం
    10.8 ఆరోహణ, అవరోహణ ప్రమేయాలు
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, Exams, TS Inter Exams 2022

    తదుపరి వార్తలు