TS INTER 1ST YEAR FOR GOOD SCORE IN SANSKRIT DOWNLOAD INTER FIRST YEAR SANSKRIT MODEL PAPER HERE KNR EVK
TS Inter 1st Year Sanskrit Model Paper-1: సంస్కృతంలో మంచి స్కోర్ సాధించండి.. తెలంగాణఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృతం మోడల్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో త్వరలో ఇంటర్మీడియేట్ బోర్డు ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలు (TS Inter Exams) నిర్వహించనుంది. తెలంగాణ విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం సంవత్సరం కూడా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 70% సిలబస్ తో మాత్రమే ఇస్తారు. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృతం మోడల్ పేపర్ మీ కోసం..
సేకరణ: శ్రీనివాస్. పి, కరీంనగర్ రచయిత: జి.రవళి, ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్, కరీంనగర్
తెలంగాణలో త్వరలో ఇంటర్మీడియేట్ బోర్డు ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలు (TS Inter Exams) నిర్వహించనుంది. తెలంగాణ విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. కానీ పరీక్షలో వచ్చే సిలబల్ విషయంలో స్పష్టత అవసరం.
రెండు సంవత్సరాలుగా విద్యకు కరోనా కారనంగా విద్యార్థులు నాణ్యమై విద్యకు దూరం అయ్యారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రత్యక్ష విద్యకు అవకాశం లేకుండా అయ్యింది. దీని ద్వారా కొద్ది మందికి మాత్రమే ఆన్లైన్ చదువు అందింది. కరోనా కారణంగా విద్యార్థులకు సరైన విద్య అందలేదని గ్రహించిన ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఇంటర్ బోర్డ్ (Telangana Inter Board) ఈ సంవత్సరం కూడా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారికి 70% సిలబస్ తో మాత్రమే modal paper తయారు చేశారు.. అందుకు అనుగుణంగా 30% సిలబస్ మినహాయిస్తూ, గతంలో లాగా ఛాయిస్ పెంచుతూ ఇంటర్ బోర్డ్ modal పేపర్స్ ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు ఉచితంగా అందివ్వనుంది.
ఈ నేపథ్యంలో ఉన్న తక్కువ సమయంలో సంస్కృతంలో ఎక్కువ మార్కులు ఎలా సాధించేలో విద్యార్థులకు తెలిసేలా మోడల్ పేపర్ ను కరీంనగర్ జూనియర్ కళాశాల గర్ల్స్ లెక్చరర్ జి.రవళి రూపొందించారు.
సంస్కృతం ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ప్రశ్నాపత్రం సాధారణంగా 16 బిట్స్ కలిగి ఉంటుంది. అందులో ప్రథమ సంవత్సరం ప్రశ్నాపత్రంలో 1,2,5,7 మరియు 9వ బిట్లు పద్యభాగం నుంచి, 2,6,8 మరియు 10వ బిట్లు గద్యభాగం నుంచి, 4వ బిట్ ఉపవాచకభాగం నుంచి, 11వ బిట్ సంవిత్పరీక్షగా, 12,13,14 మరియు 15వ బిట్లు వ్యాకరణ విభాగం నుంచి, చివరిదైన 16వ బిట్ అనువాదానికి సంబంధించినవిగా ఉంటాయి. గతంలో లాగానే ఛాయిస్‌లను పెంచి ఇస్తారు.సంస్కృతం ప్రథమ సంవత్సరం విద్యార్థులు మినహాయించి చదవాల్సిన అంశాలివియే .....
1వ Bit श्लोकं पूरयित्वा भावं लिखत। అను శ్లోకం పూరించి భావం రాయాల్సిన ప్రశ్నలో भर्तृहरि-सुभाषितानि అను ఒకే ఒక పాఠ్యాంశం నుండి *గుర్తు గల శ్లోకాలు 10 చదవాల్సి ఉండగా 2,5 మరియు 10వ శ్లోకాలు మనహాయించి 1,3,4,6,7,8,9 ఈ 7 శ్లోకాల నుండి 3 శ్లోకాల మొదటి పదం మరియు చివరిపదం ఇస్తారు. అందులో 1 దాన్ని పూరిస్తూ దాని భావం సరిగ్గా రాయగల్గితే 6 మార్కులు. కవిపరిచయం సంస్కృతంలో రాస్తే ఇంకా మంచిది.
2వ Bit एकं निबन्धप्रश्नं समाधत्त। అను పద్యభాగ వ్యాసరూప ప్రశ్నకుగాను 4 పాఠ్యాంశాలు చదవాల్సి ఉండగా लक्ष्यशुद्धि, श्रीकृष्णस्य गुरुदक्षिणा అను 2 పాఠ్యాంశాలు మినహాయించి रामो विग्रहवान् धर्मः, गानपरीक्षा అను 2 పాఠ్యాంశాల నుండి 4 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు ఇస్తారు. అందులో 1 దానికి సమాధానం సరిగ్గా రాయగల్గితే 6 మార్కులు,
3వ Bit एकं निबन्धप्रश्नं समाधत्त। అను గద్యభాగ వ్యాసరూప ప్రశ్నకుగాను 4 పాఠ్యాంశాలు చదవాల్సి ఉండగా वीरवनिता कीर्तिसेना, पितृसेवापरः श्रवणकुमारः అను 2 పాఠ్యాంశాలు మినహాయించి दयालुः दानशीलः नागार्जुनः, शरणागतरक्षणम् అను 2 పాఠ్యాంశాల నుండి 4 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు ఇస్తారు. అందులో 1 దానికి సమాధానం సరిగ్గా రాయగల్గితే 6 మార్కులు,
4వ Bit चतुर्णां प्रश्नानां समाधानानि लिखत। అను ఉపవాచక 2 మార్కుల లఘు ప్రశ్నలకుగాను 6 పాఠ్యాంశాలు చదవాల్సి ఉండగా शाश्वतं हि कार्यं करणीयम्, स्वावलम्भी राजीवः అను 2 పాఠ్యాంశాలు మినహాయించి उद्योगिनं पुरषसिंहमुपैति लक्ष्मीः, भाग्यचक्रम्, किमस्तुपेटिकायाम्, विद्वान् कुलीनो न करोति गर्वम् అను 4 పాఠ్యాంశాల నుండి 8 ప్రశ్నల్లో 8 ప్రశ్నలూ ఇస్తారు. అందులో 4 ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా రాయగల్గితే 8 మార్కులు,
5వ Bit द्वयोः ससन्दर्भं व्याख्यां सिखत। అను పద్యభాగ సందర్భవాక్య ప్రశ్నలకుగాను 4 పాఠ్యాంశములు చదవాల్సి ఉండగా लक्ष्यशुद्धि, श्रीकृष्णस्य गुरुदक्षिणा అను 2 పాఠ్యాంశాలు మినహాయించి रामो विग्रहवान् धर्मः, गानपरीक्षा అను 2 పాఠ్యాంశాల నుండి 6 ప్రశ్నల్లో 5 ప్రశ్నలు ఇస్తారు. అందులో 2 ప్రశ్నకు సమాధానాలు సరిగ్గా రాయగల్గితే 6 మార్కులు,
6వ Bit द्वयोः ससन्दर्भं व्याख्यां सिखत। అను గద్యభాగ సందర్భవాక్య ప్రశ్నలకుగాను 4 పాఠ్యాంశములు చదవాల్సి ఉండగా वीरवनिता कीर्तिसेना, पितृसेवापरः श्रवणकुमारः అను 2 పాఠ్యాంశాలు మినహాయించి दयालुः दानशीलः नागार्जुनः, शरणागतरक्षणम् అను 2 పాఠ్యాంశాల నుండి 6 ప్రశ్నల్లో 5 ప్రశ్నలు ఇస్తారు. అందులో 2 ప్రశ్నకు సమాధానాలు సరిగ్గా రాయగల్గితే 6 మార్కులు,
7వ Bit द्वौ लघुप्रश्नौ समाधत्त। అను పద్యభాగ 3 మార్కుల లఘు ప్రశ్నలకుగాను 6 పాఠ్యాంశములు చదవాల్సి ఉండగా लक्ष्यशुद्धि, श्रीकृष्णस्य गुरुदक्षिणा అను 2 పాఠ్యాంశాలు మినహాయించి भर्तृहरि-सुभाषितानि, रामो विग्रहवान् धर्मः, गानपरीक्षा, मातृगीतम् అను 4 పాఠ్యాంశాల నుండి 12 ప్రశ్నల్లో 5 ప్రశ్నలు ఇస్తారు. అందులో 2 ప్రశ్నకు సమాధానాలు సరిగ్గా రాయగల్గితే 6 మార్కులు,
8వ Bit द्वौ लघुप्रश्नौ समाधत्त। అను గద్యభాగ 3 మార్కుల లఘు ప్రశ్నలకుగాను 4 పాఠ్యాంశములు చదవాల్సి ఉండగా वीरवनिता कीर्तिसेना, पितृसेवापरः श्रवणकुमारः అను 2 పాఠ్యాంశాలు మినహాయించి दयालुः दानशीलः नागार्जुनः, टिट्टिभदम्पती कथा, शरणागतरक्षणम्, महान् जीवशास्त्रज्ञो जगदीशचन्द्रबोसः అను 4 పాఠ్యాంశాల నుండి 12 ప్రశ్నల్లో 5 ప్రశ్నలు ఇస్తారు. అందులో 2 ప్రశ్నకు సమాధానాలు సరిగ్గా రాయగల్గితే 6 మార్కులు,
9వ Bit एकेन पदेन समाधत्त। అను పద్యభాగ 1 మార్కు లఘు ప్రశ్నలకుగాను 6 పాఠ్యాంశములు చదవాల్సి ఉండగా लक्ष्यशुद्धि, श्रीकृष्णस्य गुरुदक्षिणा అను 2 పాఠ్యాంశాలు మినహాయించి भर्तृहरि-सुभाषितानि, रामो विग्रहवान् धर्मः, गानपरीक्षा, मातृगीतम् అను 4 పాఠ్యాంశాల నుండి 12 ప్రశ్నల్లో 5 ప్రశ్నలు ఇవ్వగా వాటికి సమాధానాలు సరిగ్గా రాయగల్గితే 5 మార్కులు, ఛాయిస్ ఉండదు.
10వ Bit एकेन पदेन समाधत्त। అను గద్యభాగ 1 మార్కు లఘు ప్రశ్నలకుగాను 6 పాఠ్యాంశములు చదవాల్సి ఉండగా वीरवनिता कीर्तिसेना, पितृसेवापरः श्रवणकुमारः అను 2 పాఠ్యాంశాలు మినహాయించి दयालुः दानशीलः नागार्जुनः, टिट्टिभदम्पती कथा, शरणागतरक्षणम्, महान् जीवशास्त्रज्ञो जगदीशचन्द्रबोसः అను 4 పాఠ్యాంశాల్లో 12 ప్రశ్నల్లో 5 ప్రశ్నలు ఇవ్వగా వాటికి సమాధానాలు సరిగ్గా రాయగల్గితే 5 మార్కులు, ఛాయిస్ ఉండదు.
11వ Bit अधो निर्दिष्ट कथां पठित्वा प्रश्नान् समाधत्त। అను సంవిత్పరీక్షకుగాను 6 కథలు చదవాల్సి ఉండగా बिडालस्य गले घण्टा, मूर्खस्य नास्त्यौषधम् అను 2 పాఠ్యాంశాలు మినహాయించి, गतानुगतिको लोकः, परानुकारी गर्दभः, लुब्धः कर्षकः, हितोपदेशो मूर्खानाम् అను 4 కథల నుండి 1 కథ ఇస్తారు. అందలి 5 లఘు ప్రశ్నకు సమాధానాలు సరిగా రాయగల్గితే 5 మార్కులు, ఛాయిస్ ఉండదు.
12వ Bit चत्वारि सन्धिनाम-निर्देशसहितं विघटयत। అను సంధి విడదీసే ప్రశ్నకుగాను 6 సంధులు చదవాల్సి ఉంది. అందులో सवर्णदीर्घसन्धिःలో(13), गुणसन्धिःలో(13) वृद्धिसन्धिःలో(7), यणादेशसन्धिःలో(17), पूर्वरूपसन्धिःలో(7) अयवायावादेशसन्धिःలో(5) మొత్తం 62 ప్రశ్నల నుండి 12 ప్రశ్నలు ఇస్తారు. అందులో 4 ప్రశ్నలను విడదీసి సంధిపేరు రాయగల్గితే 8 మార్కులు.
13వ Bit चत्वारि सन्धिनाम-निर्देशसहितं सन्धत। అను సంధి కలిపే ప్రశ్నకుగాను 6 సంధులు చదవాల్సి ఉంది. అందులో सवर्णदीर्घसन्धिःలో(13), गुणसन्धिःలో(13) वृद्धिसन्धिःలో(7), यणादेशसन्धिःలో(17), पूर्वरूपसन्धिःలో(7) अयवायावादेशसन्धिःలో(5) మొత్తం 62 ప్రశ్నల నుండి 12 ప్రశ్నలు ఇస్తారు. అందులో 4 ప్రశ్నలను కలిపి సంధిపేరు రాయగల్గితే 8 మార్కులు.
14వ Bit द्वयोः शब्दयोः अन्त-लिङ्ग-वचन-निर्देशसहितं रूपाणि लिखत। అను శబ్ద ప్రశ్నకుగాను 21 శబ్దములు చదవాల్సి ఉంది. అందులో पुंलिङ्गशब्दाः(5), स्त्रीलिङ्गशब्दाः(4) नपुंसकलिङऱ्गशब्दाः(3), सर्वनामशब्दाः(11) మొత్తం 21 ప్రశ్నల నుండి 4 ప్రశ్నలు ఇస్తారు. అందులో 2 ప్రశ్నలను అంత-లింగ-శబ్దములను గుర్తిస్తూ టైటిల్ లైన్ రాస్తూ, 3 వచనాల్లో 8 విభక్తులతో సంపూర్ణ శబ్దరూపం రాయగల్గితే 8 మార్కులు,
15వ Bit द्वयोः धत्वोःनिर्दिष्टानि लकाररूपाणि लिखत। అను ధాతు ప్రశ్నకుగాను 16 ధాతువులు చదవాల్సి ఉంది. అందులో परस्मैपदि-धातवः(12), आत्मनेपदि-धातवः(4) మొత్తం 16 ప్రశ్నల నుండి 4 ప్రశ్నలు ఏదేని లకారంలో మొదటి పదం ప్రశ్నగా ఇస్తారు. అందులో 2 ప్రశ్నలను 3 వచనాలు 3 పురుషలతో సంపూర్ణ లకారరూపం రాయగల్గితే 6 మార్కులు,
16వ Bit संस्कृतभाषया अनुवदत। అను అనువాద ప్రశ్నకుగాను 25 ప్రశ్నలు చదవాల్సి ఉండగా, 19 నుండి 25 వరకు మినహాయించి 18 ఇంగ్లీషు వాక్యాల్లో 5 వాక్యాలు ఇస్తారు. వాటిని సంస్కృతభాషలోకి మార్చి రాయగల్గితే 5 మార్కులు. ఇక్కడ కూడా ఛాయిస్ ఉండదు.
మొత్తంమీద సంస్కృతం ప్రథమ సంవత్సరం మోడల్ పేపర్ ఇలా ఉండబోతోంది. సంస్కృత. పద్య భాగం గద్య భాగం ఎక్కువ చదువువుతు వాటితో పాటు తెలంగాణ ఇంటర్ బోర్డ్ వారి విడుదల చేసిన పాత కొత్త ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ, చదివితే తప్పకుండ ఎక్కువ స్క్రోరు చేసే అవకాశం ఉంటుందని G. రవళి ప్రభుత్వ జూనియర్ గర్ల్స్ కళాశాల లెక్చరర్ న్యూస్ 18 తెలుగు కు తెలిపారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.