news18-telugu
Updated: July 21, 2020, 1:30 PM IST
తెలంగాణ ఐసెట్ రిజల్ట్స్ రిలీజ్
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఐసెట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. కాకతీయ యూనివర్సిటీలోని సెనెట్ హాలులో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి, ఐసెట్ కన్వీనర్, కేయూ వీసీ ఆచార్య ఆర్.సాయన్న రిజల్ట్స్‌ని విడుదలచేశారు. అభ్యర్థులు రిజల్ట్స్‌ని అఫీషియల్ వెబ్సైట్ లో కూడా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
మే 23, 24 తేదీల్లో ఆన్లైన్ ద్వారా కాకతీయ యూనివర్సిటీ ప్రవేశపరీక్ష నిర్వహించింది. తెలుగురాష్ట్రాల్లో మొత్తం 55 కేంద్రాల్లోజరిగిన ఈ పరీక్షకు 49 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో దాదాపు 97.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
రిజల్ట్స్‌లో 160.17 మార్క్స్‌తో మల్కాజ్‌గిరికి చెందిన మండవ హనీష్ సత్య మొదటిస్థానంలో నిలవగా.. మేడ్చల్ జిల్లాకు చెందిన సూర్యరూజ్వల రెండో స్థానంలో, హైదరాబాద్‌కి చెందిన ప్రద్యుమ్నరెడ్డి మూడోస్థానంలో, నిజామాబాద్ జిల్లాకి చెందిన తిరుమల సాయి నాలుగోస్థానంలో, సూర్యపేటకు చెందిన లిక్కి భార్గవి ఐదో స్థానంలో నిలిచారు.
Published by:
Amala Ravula
First published:
June 14, 2019, 5:20 PM IST