TS ICET AND TS LAWCET 2022 TSCHE EXTENDS REGISTRATION DATES HERE THE FULL DETAILS VB
Telangana Entrance Exams: విద్యార్థులకు అలర్ట్.. ఆ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
Telangana Entrance Exams: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ , TSCHE తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET), తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET) 2022లకు దరఖాస్తు చేసుకోవడానికి తేదీలను పొడిగించింది. వివరాలిలా..
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( TSCHE), తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET), తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET) 2022లకు దరఖాస్తు చేసుకోవడానికి తేదీలను పొడిగించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ విద్యా సంవత్సరం (2022–2023) ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్లైన్లో (Online) దరఖాస్తు చేసుకునేందుకు గడువును జూలై 4 వరకు పొడిగించినట్లు టీఎస్‌ఐసీఈటీ కన్వీనర్ కె రాజి రెడ్డి తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, గడువును సోమవారం వరకు పొడిగిస్తున్నామన్నారు. ఈ తేదీ తర్వాత మళ్లీ తేదీలను పొడిగిచబోమని లాసెట్ కన్వీనర్ జీబీ రెడ్డి పేర్కొన్నారు. పైన పేర్కొన్న పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు TS ICET అధికారిక సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
TS ICET, TS LAWCET 2022 దరఖాస్తులను ఇలా చేయవచ్చు..
TS ICET లేదా TS LAWCET అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించాలి. ఐ సెట్ కు దరఖాస్తు చేయాలనుకునే వారు ఈ వెబ్ సైట్ ను సందర్శించాలి. TS LAWCETకు దరఖాస్తు చేసుకునే వారు ఈ వెబ్ సైట్ ను సందర్శించండి. తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లింపు లింక్‌పై క్లిక్ చేసి.. వివరాలను నమోదు చేసి, దరఖాస్తు రుసుము చెల్లించాలి. దరఖాస్తులో పేర్కొన్న విధంగా వివరాలను నింపి దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంసెట్ తర్వాత అంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే ఎగ్జామ్ ఐసెట్. ఈ ఎగ్జామ్ ను జులై 27, 28 తేదీల్లో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ ఎగ్జామ్ కోసం 30,941 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.ఈ రెండు తేదీల్లో మూడు సెషన్లలో పరీక్ష నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. TS LAWCET పరీక్ష జూలై 21 మరియు 22, 2022 తేదీలలో నిర్వహించబడుతుందన్నారు. ఈ ఎగ్జామ్ ను జులై 21, జూలై 22, 2022న నిర్వహించనున్నారు. పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGLCET 2022) ను ఆగస్టు 8న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం 25 వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.