Home /News /jobs /

TS ICET 2021 COUNSELLING SCHEDULE RELEASED HERE IS THE IMPORTANT DATES NS

TS ICET-2021 Counselling: తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ (TS ICET-2021) ను అధికారులు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు (TS ICET-2021 Counselling Schedule) ఇలా ఉన్నాయి.

    తెలంగాణ(Telangana Exams)లో ఎంబీఏ, ఎంసీఏ (MBA, MCA) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన TS ICET 2021 కౌన్సెలింగ్ కు సంబంధించిన షెడ్యూల్ (TS ICET-2021 Counselling Schedule) ను అధికారులు తాజాగా విడుదల చేశారు. నవంబర్ 3వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (Telangana State Council of Higher Education) చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వివరాలను తెలిపారు. నవంబర్ 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆఖరి ఫేజ్ కౌన్సెలింగ్ (TS ICET-2021 Counselling Schedule) ను నిర్వహిస్తామని లింబాద్రి వివరించారు. ఐసెట్ (TS ICET 2021) లో అర్హత సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుందని వివరించారు. కౌన్సెలింగ్ లో సీట్లు కేటాయింపబడిన విద్యార్థులు నవంబర్ 27, 28, 29 తేదీల్లో సంబంధిత కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని తెలిపారు.

    మొదటి దశ కౌన్సెలింగ్ కు (TS ICET 2021 First Phase Counselling) సంబంధించిన ముఖ్యమైన తేదీలు:
    నవంబర్ 3-9: ఈ తేదీల్లో విద్యార్థులు ఆన్లైన్లో వివరాలను నమోదు చేయడంతో పాటు స్లాట్ బుకింగ్ కు అవకాశం ఉంటుంది.
    నవంబర్ 6-10: ఈ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
    నవంబర్ 6-11: ఈ తేదీల్లో విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
    నవంబర్ 14: విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.(TS ICET-2021 Seats Allotment)
    నవంబర్ 14-18: ఈ తేదీల్లో విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించడంతో పాటు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
    CBSE Board Exams: సీబీఎస్​ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో టర్మ్-1 పరీక్షలే కీలకం.. ఎందుకంటే?

    -విద్యార్థులు పూర్తి వివరాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్ సైట్ (https://www.tsche.ac.in/) ను సందర్శించవచ్చు.
    UGC-NET 2021: విడుదలైన యూజీసీ నెట్ పరీక్షల తేదీలు.. వివరాలివే..

    తెలంగాణ ఐసెట్ తుదిదశ షెడ్యూల్(TS ICET 2021 Final Phase Counselling)):
    నవంబర్ 21: మొదటి ఫేజ్ కౌన్సెలింగ్ సమయంలో నమోదు చేసుకోని వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
    నవంబర్ 22: సర్టిఫికేట్ల వెరిఫికేషన్
    నవంబర్ 22-23: ఈ తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది.
    నవంబర్ 26: అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.
    నవంబర్ 26-28: ఈ తేదీల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించడంతో పాటు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Exams, Telangana, TS EAMCET 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు