తెలంగాణలో ఐసెట్ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఎవరైనా అప్లికేషన్ ఫామ్ నింపే సమయంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే వాటిని సవరించుకునే అవకాశాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కల్పించింది. ఇందు కోసం ఏర్పాటు చేసిన అప్లికేషన్ కరెక్షన్ విండో ఈ రోజు క్లోస్ కానుంది. అభ్యర్థులు ఈ రోజు ఒక్క రోజు మాత్రమే తమ అప్లికేషన్లతో దొర్లిన తప్పులను సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. టీఎస్ఐసెట్ ఎగ్జామ్ ను ఆగస్టు 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిప్ట్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కాగా.. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. TS ECET - 2021: ఈసెట్ అభ్యర్థులకు అలర్ట్.. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వివరాలివే Telangana: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 21న ఆ ప్రవేశ పరీక్ష.. వివరాలివే
అప్లికేషన్ ఫామ్ తో దొర్లిన తప్పులను సరి చేసుకోవడానికి అభ్యర్థులు ఈ స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది.
1. అభ్యర్థులు మొదటగా ఈ లింక్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
2.అనంతరం హోం పేజీలో 'Corrections for filled in Application forms' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
3.ఇలా చేయడంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4.అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, Payment Reference ID, Qualifying Examination Hall Ticket No, Mobile Number, Date of Birth వివరాలను నమోది చేసిన Get Application బటన్ పై క్లిక్ చేయాలి.
5. ఇప్పుడు మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో కావాల్సిన కరెక్షన్స్ చేసుకోవాలి.
6.కరెక్షన్స్ చేయడం పూర్తయిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.