Home /News /jobs /

TS GURUKULAM JOBS GOOD NEWS FOR THE UNEMPLOYED GREEN SIGNAL FOR FILLING 9096 POSTS IN TS GURUKULAM EVK

Ts Gurukulam jobs: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. టీఎస్‌ గురుకులాల్లో భారీ పోస్టుల భ‌ర్తీ.. వివ‌రాలు

(ప్రభుత్వ ఉద్యోగాలు)

(ప్రభుత్వ ఉద్యోగాలు)

Telangana Government Jobs | తెలంగాణలోని ఉద్యోగార్థులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. మ‌రో 10వేల ఉద్యోగాల భ‌ర్తీకి అనుమ‌తులు మంజూరు చేసింది. ఇందులో గురుకులాలకు సంబంధించిన మొత్తం 9,096 పోస్టులున్నాయి.

    తెలంగాణలోని ఉద్యోగార్థులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. మ‌రో 10వేల ఉద్యోగాల భ‌ర్తీకి (Telangana Government Jobs) అనుమ‌తులు మంజూరు చేసింది. ఇందులో గురుకులాలకు సంబంధించిన మొత్తం 9,096 పోస్టులున్నాయి.  ఈ పోస్టుల్లో అధికంగా గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. మరో 995 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. చాలా కాలంగా గురుకుల పోస్టుల కోసం ఎంతో మంది అభ్య‌ర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గురుకులాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసే అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పిన‌ట్ట‌యింది.

    TS Police Jobs: పోలీస్‌ ఈవెంట్స్‌కు సిద్ధం అవుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అయితే బెస్ట్‌!

    గురుకులాల్లో పోస్టుల వివరాలు..























    గురుకులంపోస్టుల సంఖ్య
    మైనార్టీ గురుకులాలు1,445
    మ‌హాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాల‌యాల సొసైటీ3,870
    సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ1,514
    టీఎస్‌డ‌బ్ల్యూఆర్ఐఈ2,267

    తాజాగా ఆర్థిక శాఖ ఇచ్చిన అనుమతితో ఇప్పటిదాకా మొత్తం 45,325 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినైట్టెంది. వీటిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వివిధ దశల్లో ఉన్నవి 20,391 ఉద్యోగాలు. తాజా ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

    AP Intermediate: విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఇంట‌ర్ కాలేజీ అడ్మిష‌న్‌లు, క్లాస్‌ల తేదీలు విడుద‌ల



    Wipro Recruitment 2022: ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్ విప్రోలో జాబ్ ఓపెనింగ్స్‌.. అప్లికేష‌న్‌, అర్హ‌త‌ల వివ‌రాలు

    గతంలో 35,220 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం వివిధ శాఖల్లో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని ట్వీట్‌ చేశారు. తాజా ప్రకటనతో కలిపి ఇప్పటిదాకా 45,325 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, త్వరలోనే మరిన్న ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో.. కొందరు (బీజేపీ) చేసే ఉద్యోగాల ప్రకటనలు జుమ్లానేనని తనదైన శైలిలో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, JOBS, Jobs in telangana, Ts jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు