బీసీ గురుకులాల్లో ప్రత్యేక కోటా కింద అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) విద్యార్థులకు 3 శాతం సీట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇదివరకే ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. అనుమతులు మంజూరయితే ఈ ఏడాది నుంచే దీనిని అమలు చేయాలని బీసీ సంక్షేమశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఎంబీసీల్లోని చాలా కులాలకు చెందినవారు చాలా వెనుకబడి ఉన్నారు. రాత పరీక్షలో మిగతా కులాల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంబీసీ విద్యార్థులకు ప్రత్యేకంగా అడ్మిషన్ కల్పించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది.
అందుకోసం ఐదు సంవత్సరాలకు మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. తొలుత ఎంబీసీల కోసమే ప్రత్యేకంగా రెండు, మూడుకు మించి హాస్టళ్లను ఏర్పాటు చేయాలనే దిశగా ఆలోచనలు చేసింది. దీంతో కొద్ది మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, అదేవిధంగా దూరాభారం అవుతుందని బీసీ సంక్షేమశాఖ భావించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
వీరికి ప్రత్యేకంగా హాస్టల్‌ను ఏర్పాటు చేయకుండా, అన్ని బీసీ గురుకులాల్లో ఎంబీసీ విద్యార్థులకు 3 శాతం కోటాను ఇవ్వాలని నిర్ణయించింది. దీని ద్వారా ఎక్కుల లబ్దీ చేకూరే అవకాశం ఉంది. అదీగాక రాత పరీక్షలో మెరిట్‌తో సంబంధం లేకుండా గురుకులాల్లో ప్రవేశం కల్పించాలని భావిస్తున్నది. గురుకులాల్లో చేరగోరే ఎంబీసీ విద్యార్థులు రాత పరీక్షకు దరఖాస్తు చేసుకుని ఉండాలని మాత్రం నిబంధన విధించింది. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ ఆమోదానికి పంపింది.
ముఖ్యమైన సమాచారం..
- విద్యార్థులు గురుకులాల ప్రవేశ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఇందుకోసం రూ.100 ఆప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- ఇందుకోసం విద్యార్థులు www.tmreis.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి చదువుతూ ఉండాలి.
- విద్యార్థి తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలలోపు ఆదాయం ఉండాలి.
- ప్రవేశ పరీక్షలో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా గురుకుల పాఠశాలల్లోని ఐదో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు.
- పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
- మరింత సమాచారం తెలుసుకొనేందుకు నోట్ - టోల్ ఫ్రీ నంబర్ - 1800 425 45678
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Telangana, Ts gurukula