TS Gurukula Admissions | గురుకులాల్లో చదవాలనుకుంటున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6,7,8 తరగతుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ బీసీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. వివరాలు..
గురుకులా (Gurukulas) ల్లో చదవాలనుకుంటున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6,7,8 తరగతుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ (Telangana) బీసీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నోటిఫికేషన్‌ను విడుదలై దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. మహాత్మా జ్యోతీబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6,7,8 తరగతుల్లో సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. దీనికి సంబంధించి శనివారం బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి మల్లయ్యభట్టు ప్రకటన విడుదల చేశారు. అర్హులైన విద్యార్థులు జూన్ 2, 2022లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జూన్ 10, 2022న రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని మల్లయ్యభట్టు స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకొనేందుకు mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్‌ను 040-23322377, 233282266 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తు ప్రక్రియ గడువు పొడగింపు..
TS Gurukula Admission - గురుకులా (Gurukulas) ల్లో చదవాలనుకుంటున్న మైనార్టీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదో తరగతిలో ప్రవేశాల కోసం తెలంగాణ (Telangana) సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి నోటిఫికేషన్‌ను ఇప్పటికే విడుదల చేసింది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్క ప్రవేశ పరీక్షతో సాంఘీక మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశం పొందే వీలుంటుంది. అందుకోసం ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ (Online) లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- విద్యార్థి తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలలోపు ఆదాయం ఉండాలి.
- ప్రవేశ పరీక్షలో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా గురుకుల పాఠశాలల్లోని ఐదో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు.
- పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
- మరింత సమాచారం తెలుసుకొనేందుకు నోట్ - టోల్ ఫ్రీ నంబర్ - 1800 425 45678
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.