TS GROUPS POLICE JOBS HERE IS GENERAL SCIENCE PHYSICS TIPS BY EXPERTS NS
TS Jobs GS Preparation Tips: తెలంగాణ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నారా? ఫిజిక్స్ వెయిటేజీ, టిప్స్, చదవాల్సిన బుక్స్ వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు (Telangana Government Jobs) సంబంధించిన నోటిఫికేషన్ల జాతర సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిజిక్స్ కు సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్, చదవాల్సిన బుక్స్, వెయిటేజీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో భారీగా ఉద్యోగ నియామకాలకు (Telangana Government Jobs) సంబంధించిన నోటిఫికేషన్లు (Job Notifications) ఇటీవల విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ రోజుతో 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా.. ఈ నెలాఖరుతో 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు గడువు ముగియనుంది. మరికొన్ని రోజుల్లోనే గ్రూప్ 2, 4 కు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతోంది. ఆగస్టులో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వర్గాలు చెబుతున్నాయి. నియామక పరీక్షల తేదీలు సమీపుస్తున్నా కొద్దీ అభ్యర్థులు ప్రిపరేషన్లో వేగం పెంచుతున్నారు. అన్ని నియామక పరీక్షల్లోనూ జనరల్ సైన్స్ సబ్జెక్టుకు అందులోనూ ఫిజిక్స్ కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫిజిక్స్ సీనియర్ ఫ్యాకల్టీ అల్లం సాయికృష్ణ అందించిన సలహాలు, సూచనలు అభ్యర్థుల కోసం..
ప్రతీ నియామక పరీక్షలోనూ ఫిజిక్స్ సబ్జెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని ఆయన వివరించారు. ఆ సబ్జెక్టుకు ఉండే వెయిటేజీ మనకు జాబ్ డిసైడ్ చేస్తుందని చెప్పారు. ఫిజిక్స్ సబ్జెక్టు నుంచి గ్రూప్స్ జాబ్స్ కు సంబంధించిన నియామక పరీక్షలో 6 నుంచి 10 ప్రశ్నలు వస్తాయన్నారు. ఇంకా కానిస్టేబుల్, పోలీస్ జాబ్స్ కు సంబంధించిన నియామక పరీక్షల్లో 11 నుంచి 15 ప్రశ్నలు వస్తాయన్నారు. సిలబస్ లో ఫిజిక్స్ నుంచి 10, కెమిస్ట్రీ నుంచి 10 టాపిక్స్ ఉంటాయన్నారు. TS Police Jobs - TSLPRB: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. 17,516 ఉద్యోగాల దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేయండి
నిజ జీవితంలో మనం అప్లై చేసే ఫిజిక్స్, కెమిస్ట్రీ పై ఎక్కువ ప్రశ్నలు ఉంటాయన్నారు. కాంతి టాపిక్స్ ను పరిశీలిస్తే ఆకాశం నీలం రంగులో ఎందుకు ఉంటుంది. ట్రాఫిక్ లో ఎంత సౌండ్ వస్తే ధ్వని కాలుష్యం అని చెప్పవచ్చు లాంటి నిజ జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయన్నారు. ఇంకా గాలి పటాలు, పాస్కల్ నియమం అనువర్తనాలు లాంటి అంశాలపై పట్టు పెంచుకోవాలన్నారు.
పాత పేపర్లను ప్రాక్టిస్ చేయడం, మోడల్ పేపర్లకు ఆన్సర్ చేయడం ద్వారా ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రశ్నను పరిపూర్ణంగా చదివి సమాధానం ఇవ్వడం అలవరుచుకోవాలన్నారు. SCRT, NCRT, తెలుగు అకాడమీ జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలను చదవాలని అభ్యర్థులకు సాయికృష్ణ సూచించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.