Home /News /jobs /

TS GROUP 1 EXAM DATE FINALIZED HOW MANY CONTESTANTS PER POST KNOW KEY POINTS IN THE SELECTION PROCESS EVK

TS Group-1: గ్రూప్-1 ప‌రీక్ష తేదీ ఖరారు.. ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ.. ఎంపిక విధానంలో కీల‌క విష‌యాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Group-1 | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌రువాత జ‌రుగుతున్న తొలి గ్రూప్-1 ప‌రీక్ష ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ముగిసింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా తెలం గాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారైం ది. అక్టోబరు 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వ హిం చాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించిం ది

ఇంకా చదవండి ...
    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌రువాత జ‌రుగుతున్న తొలి గ్రూప్-1 ప‌రీక్ష ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ముగిసింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా తెలం గాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారైం ది. అక్టోబరు 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వ హిం చాలని
    టీఎస్పీఎస్సీ నిర్ణయించిం ది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ (Group-1 Prelims)ను ఆలస్యంగా నిర్వహించాలి అంటూ అభ్యర్థులు కోరుతున్నారు. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీ హెల్ప్‌లైన్‌కు కాల్స్ చేస్తున్నారు. ప్రిప‌రేష‌న్‌కు మ‌రింత స‌మ‌యం కావాల‌ని అభ్య‌ర్థులు కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే అధికారులు అన్ని ప‌రీశీలించి అక్టోబ‌ర్‌న ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌ను ఏర్పాటు చేశారు.

    RBI Grade B: ఆర్‌బీఐ గ్రేడ్- B ఫేజ్‌ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

    ఒక్కో పోస్టుకు 756 మంది  పోటీ..

    గ్రూప్ -1 లో మొత్తం 503 పోస్టులకు 3,80,202 మం ది అభ్య ర్థులు దరఖాస్తు చేసుకున్నా రు. ఒక్కో పోస్టుకు సగటున 756 మం ది చొప్పు న పోటీపడుతున్నా రు.  గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యా యి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేయగా, ఒక్కో పోస్టుకు సగటున 672 మం ది పోటీపడుతున్నా రు. జనరల్ పోస్టుల్లోనూ మెరిట్ సాధిస్తే మరిన్ని పోస్టులు పొం దేం దుకు అవకాశముం ది. దివ్యాం గుల కేటగిరీలో గల 24 పోస్టులకు 6,105 మం ది
    దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 254 మం ది చొప్పు న పోటీలో ఉన్నా రు. 51,553(15.33శాతం )మం ది ప్రభుత్వ ఉద్యో గులూ దరఖాస్తు చేశారు.

    Agnipath Scheme: యువ‌త కోసం కేంద్రం అగ్నిపథ్ స్కీమ్.. ఏమిటి ప్ర‌త్యేక‌త‌లు.. వివ‌రాలు

    రోస్ట‌ర్ మెరిట్ ద్వారా ఎంపిక‌..

    - ఈసారి ప్రిలిమ్స్​ మార్కుల ఆధారంగానే మెయిన్స్​కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

    - ఒక్కో పోస్టుకు 50 మందిని చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయనున్నట్టు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది.

    - గతంలో జనరల్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉండేది. కానీ ప్రస్తుతం రోస్టర్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

    - మొత్తం 503 పోస్టులకు గాను ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 25,150 మందిని ఎంపిక చేయాలి.

    - ప్రిలిమ్స్​లో టాప్​లో నిలిచిన 25,150 మందిని కాకుండా... రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

    - మొదట మొత్తం ఎన్ని ఓపెన్ పోస్టులు ఉంటే, ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున టాప్ లో నిలిచిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

    - ఆ తర్వాత రిజర్వ్ డ్ పోస్టులకు ఆ కేటగిరీలోని ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున టాప్ లో ఉన్న ఆ కేటగిరీ అభ్యర్థులనే ఎంపిక చేస్తారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Group 1, Jobs in telangana, Ts jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు