TS GOVT JOBS PREPARATION CANT FIND TELUGU ACADEMY BOOKS THEN DO THE PREPARATION LIKE THIS EVK
Govt Jobs Preparation: తెలుగు అకాడమీ పుస్తకాలు దొరకడం లేదా.. అయితే ప్రిపరేషన్ ఇలా చేయండి!
(ప్రతీకాత్మక చిత్రం)
Telugu Academy Books | తెలంగాణలో చాలా కాలంగా ప్రభుత్వ పరీక్షలు లేకపోవడం.. ప్రభుత్వం వెంటనే ఖాళీల భర్తీకి ముందుకు రావడంతో మార్కెట్ (Market) లో తెలుగు అకాడమీ పుస్తకాల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పుస్తకాలు దొరకని వారి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకోండి.
తెలంగాణ (Telangana) ప్రభుత్వం దాదాపు 80,000 ఉద్యోగాలకు పైగా ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టారు. ప్రభుత్వం ఏ శాఖల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి.. అంత సమాచారాన్ని అందించింది. చాలా కాలంగా పరీక్షలు లేకపోవడం.. ప్రభుత్వం వెంటనే ఖాళీల భర్తీకి ముందుకు రావడంతో మార్కెట్ (Market) లో పుస్తకాల కొరత ఏర్పడింది. ప్రస్తుతం తెలుగు అకాడమీ (Telugu academy) పుస్తకాలను చాలా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో పుస్తకాలు దొరకని వాళ్లు కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపరేర్ అయ్యే అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు తెలుసుకోండి.
- తెలుగు అకాడమీ పుస్తకాలు గ్రూప్-1 మెయిన్స్ (Group-1 Mains) కు కీలకంగా ఉపయోగపడుతాయని, ప్రిలిమ్స్ సమయంలో ఇతరత్రా స్టడీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు.
- ప్రిలిమ్స్ పేపర్లో జనరల్ స్టడీస్, వర్తమాన అంశాలు, కరెంట్ ఆఫైర్స్ (Current Affaires) , జాగ్రఫీ, ఎకానమీ, జాతీయ అంతర్జాతీయ అంశాల నుంచే అధిక ప్రశ్నలు వస్తాయి.
- ఈ నేపథ్యంలో అభ్యర్థులు పుస్తకాలు కాకుండా పత్రికలు, వాటిల్లోని వ్యాసాలు, ఆర్టికల్స్‌ను అవగాహన చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెప్తున్నారు.
- కేవలం అకాడమీ పుస్తకాలపైనే పూర్తిగా ఆధారపడకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించిన సిలబస్ ప్రకారం ఆయా సబ్జెక్టులను ఇతరత్రా పుస్తకాలు, పత్రికలు, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా అవగాహన చేసుకోవాలని తెలుపుతున్నారు.
పుస్తకాలు దొరకనంత మాత్రనా ప్రిపరేషన్ తగ్గిపోయింది అనే భావన సరికాదని నిపుణులుచెబుతున్నారు. ఉద్యోగాల భర్తీ, పోటీ పరీక్షల నేపథ్యంలో కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలుగు అకాడమీ కసరత్తు చేస్తున్నది. ముఖ్యంగా ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్ -1, గ్రూప్ – 2, పోలీసు, టీచర్ ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం ఉంది.
వారంతా తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలనే ఎంపిక చేసుకొంటారు. ఈ పుస్తకాలనే ప్రశ్నపత్రాల రూపకల్పనకు ప్రామాణికంగా తీసుకొంటారన్న అభిప్రాయం అందరిలో ఉంది. డిమాండ్ ఉన్న 15 రకాల పుస్తకాల పునర్ముద్రణకు చర్యలు చేపట్టింది. ప్రతి ఏటా రూ.20 కోట్లకుపైగా వెచ్చించి తెలుగు అకాడమీ పుస్తకాలను ముద్రిస్తుండగా, ఈ సారి అదనంగా రూ. 5 నుంచి 10 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.