Home /News /jobs /

TS GOVT JOBS ALERT FOR GROUP 1 TET CANDIDATES CLEAR ANNOUNCEMENT ON APPLICATIONS EXAM DATES EVK

TS Govt Jobs: గ్రూప్‌-1, టెట్‌ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ద‌ర‌ఖాస్తులు, ప‌రీక్ష తేదీల‌పై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS Job News | తెలంగాణ ఆవిర్భావం త‌రువాత వ‌చ్చిన మొద‌టి గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌కు అభ్య‌ర్థుల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుంది. గ్రూప్‌-1 దరఖాస్తులకు తుది గడువు మరో 11 రోజులు మాత్రమే ఉన్నది. ఈ నేప‌థ్యంలో అధికారుల నుంచి కీల‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

ఇంకా చదవండి ...
  తెలంగాణ ఆవిర్భావం త‌రువాత వ‌చ్చిన మొద‌టి గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌కు అభ్య‌ర్థుల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుంది. గ్రూప్‌-1 దరఖాస్తులకు తుది గడువు మరో 11 రోజులు మాత్రమే ఉన్నది. ఈ పరీక్షకు ఇప్పటి వరకూ 1,66,679 మంది దరఖాస్తు చేశారు. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో కొత్తగా 1,28, 578 మంది వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) చేసుకొన్నారు. ఓటీఆర్‌) చేసుకొంటేనే గ్రూప్‌-1కు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉన్నది. ఇప్పటివరకు 2,68, 928 మంది ఓటీఆర్‌ అప్‌డేట్‌ చేసుకోగా, ఇంకా 22,69,662 మంది అప్‌డేట్‌ చేయాల్సి ఉన్నది. గ్రూప్‌-1కు దరఖాస్తు చేసేందుకు ఈ నెల 31 వరకు అవకాశం ఉన్నది.

  TS Police Jobs: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఎస్ఐ రిక్రూట్‌మెంట్‌లో మార్పులు.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

  ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు లేదు..
  చాలా మంది అభ్య‌ర్థులు గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంచాల‌ని కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీఎస్ పీఎస్సీ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. అప్లికేష‌న్‌ల గ‌డువు పెంపు లేద‌ని స్ప‌ష్టం చేసింది. శనివారం టీఎస్ పీఎస్సీ పాలకమం డలి సమావేశం సెక్రెటరీ అనితా రామచం ద్రన్ ఆధ్వ ర్యం లో జరిగిం ది. ఈ స‌మంవేశంలో ఈ నిర్ణ‌యం తీసుకొంది.

  టెట్ తేదీల్లో మార్పు లేదు..

  ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వా హణపై విద్యా శాఖ మం త్రి సబితా ఇంద్రారెడ్డి(SabithaIndra Reddy) మరోసారి క్లారిటీ ఇచ్చా రు. జూన్ 12న జరిగే టెట్ పరీక్ష వాయిదా వేయడం కుదరదని స్ప ష్టం చేశారు. 12న ఆర్ఆర్ బీ(RRB) పరీక్ష కూడా ఉం డటం తో టెట్ పరీక్షను వాయిదా వేయాలని రెం డిం టికి అప్లై చేసుకున్న అభ్య ర్థుల నుంచి డిమాండ్లు వ‌స్తున్నాయి.

  HPCL Recruitment 2022: హెచ్‌పీసీఎల్‌లో 186 ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ.55,000.. ద‌ర‌ఖాస్తుకు మూడు రోజులే చాన్స్‌

  ఈ క్ర‌మంలో ఓ అభ్య‌ర్థి టెట్ పరీక్షను వాయిదా వేసేలా కృషి చేయాలని మం త్రి కేటీఆర్(KTR) కు ట్వీట్ చేశారు. ఆయన సబితా ఇంద్రారెడ్డికిడ్డి ట్వీట్‌ ఫార్వర్డ్ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి స్పందించి విష‌యంపై స‌మీక్షించి నిర్ణ‌యం ప్ర‌క‌టించారు.

  Telangana Exam Tips: కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా.. ఎక్కు స్కోర్ సాధించేందుకు ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి!

  తెలంగాణలో పోలీసు  పోస్టుల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తు గడువును మే 26, 2022 వ‌ర‌కు పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) మొత్తం 16,614 సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల‌కు సంబంధించి వ‌యోప‌రిమితిని 30 ఏళ్ల‌కు పెంచారు. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి మ‌రో అవ‌కాశం వ‌చ్చింది.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Govt Jobs 2022, Jobs in telangana, Ts jobs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు