Govt jobs 2022 | తెలంగాణలో వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తాజాగా మరో భారీ నోటిఫికేషన్ రానుంది. యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది
తెలంగాణలో వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తాజాగా మరో భారీ నోటిఫికేషన్ రానుంది. యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓయూ, జేఎన్టీయూహెచ్, కాకతీయ వంటి అన్ని రకాల యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉన్నత విద్యాధికారులు, యూనివర్సిటీ అధికారులను ఆదేశించారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో మొత్తం 2,774 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వీటిని త్వరలోనే భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల్లో అత్యధికంగా ఓయూలో 2,075 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్ టెక్నికల్లో జూనియర్ అసిస్టెంట్లు, ఆ పై క్యాటగిరీ పోస్టులను మాత్రమే భర్తీ చేసే అవకాశాలున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రమంలో ఓయూ పరిధిలో 680 పైగా జూనియర్ అసిస్టెంట్ల భర్తీకి చాన్స్ ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ పూర్తయింది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువును మే 26, 2022 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) మొత్తం 16,614 సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి వయోపరిమితిని 30 ఏళ్లకు పెంచారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం వచ్చింది.
చాలా మంది అభ్యర్థులు గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. అప్లికేషన్ల గడువు పెంపు లేదని స్పష్టం చేసింది. శనివారం టీఎస్ పీఎస్సీ పాలకమం డలి సమావేశం సెక్రెటరీ అనితా రామచం ద్రన్ ఆధ్వ ర్యం లో జరిగిం ది. ఈ సమంవేశంలో ఈ నిర్ణయం తీసుకొంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.