హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS EdCET 2021: తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ వచ్చింది... ఎగ్జామ్ ఎప్పుడంటే

TS EdCET 2021: తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ వచ్చింది... ఎగ్జామ్ ఎప్పుడంటే

TS EdCET 2021: తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ వచ్చింది... ఎగ్జామ్ ఎప్పుడంటే
(ప్రతీకాత్మక చిత్రం)

TS EdCET 2021: తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ వచ్చింది... ఎగ్జామ్ ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

TS EdCET 2021 | బీఈడీ చదవాలనుకుంటున్నారా? తెలంగాణలో ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్హతలు, పరీక్ష తేదీ, ఇతర వివరాలు తెలుసుకోండి.

ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునేవారికి గుడ్ న్యూస్. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TS EdCET నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తోంది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలనుకునేవారు టీఎస్ఎడ్‌సెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. 2021 ఆగస్ట్ 24, 25 తేదీల్లో ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2021 ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. 2021 జూన్ 15 లోగా అప్లై చేయాలి. ఈసారి ఎడ్‌సెట్ విషయంలో పలు మార్పులు చేసింది ప్రభుత్వం. బీఏ, బీఎస్సీ, బీకామ్ లాంటి సంప్రదాయ డిగ్రీ కోర్సులు పూర్తిచేసినవారు మాత్రమే కాకుండా, ఇతర సబ్జెక్స్‌తో డిగ్రీ పాస్ అయినవారు కూడా బీఈడీ చేయొచ్చు. టీఎస్ ఎడ్‌సెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇదే వెబ్‌సైట్‌లో ఉంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాతే దరఖాస్తు చేయాలి.

FSSAI Recruitment 2021: ఫుడ్ సేఫ్టీ అథారిటీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

IRCON Recruitment 2021: రైల్వేకు చెందిన సంస్థలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

TS EdCET 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 19

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 15

రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 25

రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 5

రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 20

టీఎస్ ఎడ్‌సెట్‌ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్- 2021 ఆగస్ట్ 24 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫోర్‌నూన్ సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్టర్‌నూన్ సెషన్, ఆగస్ట్ 25 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫోర్‌నూన్ సెషన్ ఉంటుంది.

ECIL Recruitment 2021: ఈసీఐఎల్‌లో 111 ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ

IT Jobs: నిరుద్యోగులూ బీ రెడీ... ఇన్ఫోసిస్, టీసీఎస్‌లో 65,000 ఉద్యోగాలు

TS EdCET 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హతలు- బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ హోమ్ సైన్స్, బీసీఏ, బీబీఎం, బీఏ ఓరియెంటల్ లాంగ్వేజెస్, బీబీఏ లేదా ఏదైనా మాస్టర్స్ డిగ్రీ కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావాలి. బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులుకు 40 శాతం మార్కులతో పాస్ అయితే చాలు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయొచ్చు.

దరఖాస్తు ఫీజు- రూ.650. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.450.

వయస్సు- 2021 జూలై 1 నాటికి 19 ఏళ్లు పూర్తై ఉండాలి

పరీక్షా కేంద్రాలు- ఆదిలాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్, హైదరాబాద్ వెస్ట్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, సత్తుపల్లి, కరీంనగర్‌, మహబూబ్‌నగర్, సిద్దిపేట్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్, పాల్వంచ, కర్నూలు, విజయవాడ.

First published:

Tags: CAREER, Exams, JOBS, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu, TS EDCET 2021

ఉత్తమ కథలు