TS EDCET 2020: తెలంగాణ ఎడ్‌సెట్ 2020 నోటిఫికేషన్ వచ్చేసింది... పూర్తి వివరాలివే

TS EDCET 2020 Notification | ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునేవారికి శుభవార్త. తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఎంట్రెన్స్ టెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: February 25, 2020, 1:18 PM IST
TS EDCET 2020: తెలంగాణ ఎడ్‌సెట్ 2020 నోటిఫికేషన్ వచ్చేసింది... పూర్తి వివరాలివే
TS EDCET 2020: తెలంగాణ ఎడ్‌సెట్ 2020 నోటిఫికేషన్ వచ్చేసింది... పూర్తి వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TS EDCET 2020 నోటిఫికేషన్ విడుదలైంది. ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఫిబ్రవరి 20న విడుదల కావాల్సి ఉంది. కానీ... తెలంగాణ ఎడ్‌సెట్ నిర్వహిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 27న ప్రారంభం కానుంది. 2020 మే 23న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంట్రెన్స్ టెస్ట్ జరుగుతుంది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్-BEd కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు ముందుగా తెలంగాణ ఎడ్‌సెట్ రాయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయినవారికే రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరడానికి అవకాశం లభిస్తుంది. బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ పాసైనవారు కూడా ఎడ్‌సెట్ రాసి బీఈడీలో చేరొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

TS EDCET 2020: ముఖ్యమైన తేదీలు ఇవే...


నోటిఫికేషన్ విడుదల- 2020 ఫిబ్రవరి 24

దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 20 (లేట్ ఫీజు లేకుండా)
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 25


రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 30రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 4
హాల్ టికెట్స్ డౌన్‌లోడ్- 2020 మే 15 నుంచి
టీఎస్ ఎడ్‌సెట్ 2020 పరీక్ష తేదీ- 2020 మే 23
ప్రిలిమినరీ కీ విడుదల- 2020 మే 27
ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించేందుకు చివరి తేదీ- 2020 మే 30
ర్యాంకుల వెల్లడి- 2020 జూన్ 11

TS EDCET 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హత- ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ. కనీసం 50% మార్కులతో పాస్ కావాలి. బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ పాసైనవారికీ అవకాశం. సైన్స్, మ్యాథ్స్ స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ 55% మార్కులతో పాస్ కావాలి.
వయస్సు- 2020 జూలై 1 నాటికి కనీసం 19 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- జనరల్ విద్యార్థులకు రూ.650. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.450.
టీఎస్ ఎడ్‌సెట్ 2020 డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Doordarshan Jobs: విజయవాడలోని దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు... అప్లై చేయండిలా

Andhra Pradesh Job Mela: మొత్తం 730 పోస్టుల భర్తీకి విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు

SSC Recruitment 2020: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 1157 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

 
First published: February 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు