TS EDCET Results 2020: తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు వచ్చేశాయి... రిజల్ట్స్ లింక్ ఇదే

TS EDCET Results 2020 | మీరు తెలంగాణలో ఎడ్ సెట్ ఎగ్జామ్ రాశారా? ఫలితాలు వచ్చేశాయి. చెక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

news18-telugu
Updated: October 28, 2020, 1:19 PM IST
TS EDCET Results 2020: తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు వచ్చేశాయి... రిజల్ట్స్ లింక్ ఇదే
TS EDCET Results 2020: తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు వచ్చేశాయి... రిజల్ట్స్ లింక్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TS EDCET 2020 ఫలితాలు విడుదలయ్యాయి. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఎడ్‌సెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఎడ్‌సెట్ ఎగ్జామ్‌లో 97.58 మంది విద్యార్థులు అర్హత సాధించడం విశేషం. అమ్మాయిలు 76.07 శాతం పాసయ్యారు. ఫలితాలను https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేయొచ్చు. తెలంగాణలో 206 బీఈడీ కాలేజీల్లో 18 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. క్వాలిఫై అయిన అభ్యర్థులకు త్వరలో కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ షెడ్యూల్ నవంబర్ మొదటి వారంలో విడుదల కానుంది. మరి తెలంగాణ ఎడ్‌సెట్ రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

IBPS RRB Recruitment 2020: బ్యాంకు ఉద్యోగం మీ కలా? 8424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ECIL Recruitment 2020: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు

TS EDCET Results 2020: చెక్ చేయండి ఇలా


అభ్యర్థులు ముందుగా https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Download Rank Card లింక్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Ed.CET Hallticket No, Date of Birth ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత View Rank Card పైన క్లిక్ చేయాలి.
ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
ఫలితాల కాపీని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

IBPS PO Recruitment 2020: గుడ్ న్యూస్... 3517 బ్యాంకు ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్

AP Jobs 2020: రిలయెన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో 168 ఉద్యోగాలు... మహిళలకు మాత్రమే

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ ఎడ్‌సెట్‌ను నిర్వహించింది. రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రతీ ఏటా ఈ పరీక్షలు జరుగుతుంటాయి.
Published by: Santhosh Kumar S
First published: October 28, 2020, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading