TS EDCET 2020: రేపే తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్... పరీక్ష ఎప్పుడంటే

TS EDCET 2020 Notification | ఉస్మానియా యూనివర్సిటీ ఫిబ్రవరి 20న TS EDCET 2020 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 2020 మే 23న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించబోతోంది.

news18-telugu
Updated: February 19, 2020, 11:17 AM IST
TS EDCET 2020: రేపే తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్... పరీక్ష ఎప్పుడంటే
TS EDCET 2020: రేపే తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్... పరీక్ష ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకుంటున్నారా? టీచర్ కావడం మీ కలా? తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TS EDCET 2020 నోటిఫికేషన్ ఫిబ్రవరి 20న విడుదల కాబోతోంది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్-BEd చదివి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకుంటున్నవారికి ఇది మంచి అవకాశం. బీఈడీలో చేరడానికి ఎడ్‌సెట్ రాయాల్సి ఉంటుంది. స్టేట్ లెవెల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించబోతోంది. బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ పాసైనవారు కూడా ఎడ్‌సెట్ రాసి బీఈడీలో చేరొచ్చు. తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల్లో 12 పరీక్షా కేంద్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కర్నూలులో కూడా ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి. ఫిబ్రవరి 20 నుంచి https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది.

TS EDCET 2020: ముఖ్యమైన తేదీలు ఇవే...


నోటిఫికేషన్ విడుదల- 2020 ఫిబ్రవరి 20

దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 24
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 20 (లేట్ ఫీజు లేకుండా)
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 25


రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 30రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 4
అడ్మిట్ కార్డుల విడుదల- 2020 మే రెండో వారం
ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించే తేదీ- 2020 మే 23
ర్యాంకుల వెల్లడి- 2020 జూన్ 11

TS EDCET 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హత- బ్యాచిలర్స్ డిగ్రీ. బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ పాసైనవారికీ అవకాశం.
దరఖాస్తు ఫీజు- జనరల్ విద్యార్థులకు రూ.650. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.450.

గత ఏడాది నిర్వహించిన ఎడ్‌సెట్‌కు మొత్తం 52,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 43,000 మంది పరీక్షకు హాజరయ్యారు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Intermediate: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త... యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాఠాలు

Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే

Axis Bank Jobs: ఈ కోర్సు పాసైతే యాక్సిస్ బ్యాంకులో జాబ్ గ్యారెంటీ
First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు