టీఎస్ ఎడ్ సెట్ 2022 కౌన్సెలింగ్ షెడ్యూల్(Schedule) విడుదలైంది. అక్టోబర్ 18, 2022 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు వివరాలను అధికారులు వెబ్ నోట్ ద్వారా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఈడీసీట్ల భర్తీకి ఉద్దేశించిన ఎడ్‌సెట్(Ed Cet) కౌన్సెలింగ్ అక్టోబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి అక్టోబర్ 17, 2022న షెడ్యూల్ ను ఖరారు చేస్తూ.. వెబ్ నోట్ ను విడుదల చేసింది. http://edcetadm.tsche.ac.in/ వెబ్ సైట్ లో వివరాలు తెలుసుకోవచ్చు.
తొలి విడత కౌన్సెలింగ్ కు సంబంధించి అక్టోబర్ 18 నుంచి 26వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. నవంబర్ 14 నుంచి తరగతులు మొదలుపెట్టాలని నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల.
అక్టోబర్ 18 - 26 తేదీల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన
అక్టోబర్ 28 - 30 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ
నవంబరు 4వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
నవంబర్ 5 - 11వ తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని బీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షను జూలై 25న నిర్వహించింది. ఈ ఎడ్‌సెట్‌కు 83 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రవాప్తంగా 39 పరీక్ష కేంద్రాల్లో మూడు సెషన్లుగా పరీక్ష జరిగింది. మొత్తం 38,091 మంది ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 31,578 మంది హాజరయ్యారు. అయితే విటికి సంబంధించి ఫలితాలను ఆగస్టు నెలలో విడుదల చేశారు. ఫలితాల్లో 96.84శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 30,580మంది క్వాలిఫై అయ్యారు. ఈ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా విద్యార్థి మొహంతీకి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 2వ ర్యాంక్ ఆంజనేయులు, 3వ ర్యాంకు ముఖేష్ లు సాధించారు.
అంతే కాకుండా.. ఈ నెల 19వ తేదీ నుంచి బీపీఈడీ, డీపీఈడీ సీట్ల భర్తీ కొరకు పీఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అక్టోబర్ 18(రేపు)న నోటిఫికేషన్ విడుదల చేయన్నారు. అక్టోబర్ 19 నుంచి 26 మధ్య సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. నవంబరు 14న తరగతులు మొదలు కానున్నాయి.
ఎడ్ సెట్ కౌన్సిలింగ్ ఇలా..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
-దీనిలో Apply for online certificate verification అనే ఆప్షన్ పై క్లిక్ ఇవ్వండి.
-తర్వాత ఈ వెబ్ పేజీలో పేర్కొన్న వివరాలను ఇచ్చి.. అర్హతగల సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాలి.
-ఈ ప్రక్రియ అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 26 వరకు కొనసాగుతుంది.
-ఫేజ్ 1 వెబ్ ఆప్షన్లు అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానున్నాయి. వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి డైరెక్ట్ గా ఈ వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Telangana, TS EDCET 2022