TS ECET Counselling 2019 : రేపట్నుంచి తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్, ముఖ్య తేదీలు ఇవే..

TS ECET Counselling 2019 | గతేడాది వరకు బీటెక్, బీఫార్మసీ ఫస్టియర్‌లో ఉన్న మొత్తం సీట్లకు 20 శాతం సీట్లు అదనంగా కేటాయించి ఈసెట్ ర్యాంకర్లకు సెకండియర్‌లో ప్రవేశాలు ఇచ్చేవారు. కానీ, ఈసారి ఏఐసీటీఈ దాన్ని 10శాతానికి కుదించింది.దీంతో సీట్ల సంఖ్య తగ్గనుంది.

news18-telugu
Updated: June 21, 2019, 5:02 PM IST
TS ECET Counselling 2019 : రేపట్నుంచి తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్, ముఖ్య తేదీలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 21, 2019, 5:02 PM IST
తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 22 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా బీటెక్, బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. దీనికోసం అధికారులు టైమ్‌టేబుల్ ఖరారు చేశారు. ఈసెట్‌లో 24,497మంది కనీస మార్కులు సాధించి కౌన్సెలింగ్‌కి అర్హత సాధించారు.

గతేడాది వరకు బీటెక్, బీఫార్మసీ ఫస్టియర్‌లో ఉన్న మొత్తం సీట్లకు 20 శాతం సీట్లు అదనంగా కేటాయించి ఈసెట్ ర్యాంకర్లకు సెకండియర్‌లో ప్రవేశాలు ఇచ్చేవారు. కానీ, ఈసారి ఏఐసీటీఈ దాన్ని 10శాతానికి కుదించింది.దీంతో సీట్ల సంఖ్య తగ్గనుంది.
కౌన్సెలింగ్‌కి సంబంధించిన పూర్తి వివరాలను అఫీషియల్ వెబ్‌సైట్‌లో శనివారం నుంచి tsecet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

కౌన్సెలింగ్ టైమ్ టేబుల్ ఇదే..
ఈనెల 22 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం పూర్తిచేయడం, ప్రాసెసింగ్ రుసుం చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలనకు సహాయకేంద్రాన్ని, స్లాట్ బుకింగ్ ఎంపిక చేసుకోవచ్చు.


24నుంచి 26 వరకు : స్లాట్ బుక్ చేసుకున్నవారికి ధ్రువపత్రాల పరిశీలన
24 నుంచి 27 వరకు కాలేజీలు, కోర్సులు ఎంచుకోవచ్చు.
Loading...
27వ తేదీన ఫ్రీజింగ్
29న సీట్ల కేటాయింపు
29 నుంచి జులై 4 వరకు వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లించడం.
First published: June 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...