పాలిటెక్నిక్ నుంచి ఇంజినీరింగ్ చేరడానికి ఈసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతీ ఏడాది ఈ పరీక్షలో సీట్లు మిగిలిపోతున్నాయి. టీఎస్ ఈసెట్‌లో క్వాలిఫై అయితే చాలు.. విద్యార్థులకు ఈ సారి సీటు కచ్చితంగా రానుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) మినహా అన్ని బ్రాంచిల్లో సీట్లు పుష్కలంగా ఉన్నాయి. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా బీటెక్ ఫస్టియర్‌లో మిగిలిన 22 వేలకుపైగా సీట్లను ఈ సెట్ ద్వారా భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఈసెట్ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇందుకు సెకండియర్‌లో అన్ని కోర్సుల్లో 10శాతం సీట్లను పెంచుతారు. కొంతకాలంగా బీటెక్ కోర్సుల్లో సీట్లు పూర్తిగా నిండటం లేదు. ఈ లెక్కన ఈసెట్‌లో క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ సీట్లు దర్కే అవకాశాలున్నాయి.
TS Jobs Coaching: నిరుద్యోగులకు అలర్ట్.. ఉచిత శిక్షణ.. రూ.1,500 విలువైన స్టడీ మెటీరియల్
కాలేజీల వివరాలు..
మొత్తం కళాశాలలు | 178 | మొత్తం సీట్లు - 79,856 | ఖాళీ సీట్లు - 22,679 |
యూనివర్సిటీలు | 15 | 4,069 | 726 |
ప్రైవేటు యూనివర్సిటీలు | 02 | 1,586 | 486 |
ప్రైవేటు కాలేజీలు | 158 | 74,201 | 21,467 |
హైదరాబాద్ లో ఇంటర్న్ షిప్ అవకాశాలు..
థియరీ క్లాసులు(Theory Classes), పుస్తకాల ద్వారా నేర్చుకొన్న అంశాలను ప్రాక్టికల్‌గా(Practicals) అభ్యసించేందుకు ఇంటర్న్‌షిప్(Internship)లు ఉపయోగపడుతాయి. వృత్తిపరమైన అంశాలపై అవగాహన పెంచుకోవడానికి, ఆఫీసు(Office) వాతావరణానికి అలవాటు పడటానికి ఇంటర్న్‌షిప్‌లు(Internship) చక్కటి వేదికలు.
అడిఫినిటీ గ్లోబల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బిజినెస్ డెవలప్మెంట్ (సేల్స్)
కొల్లం, కోజికోడ్, తిరువనంతపురం, తిరువల్ల, మువట్టుపుజా, తలస్సేరి సహా పలు ప్రదేశాలలో అడ్వర్టైజింగ్ టెక్నాలజీ స్టార్టప్ ఇంటర్న్‌షిప్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్న్‌షిప్ కాలం ఆరు నెలలు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 స్టైఫండ్ అందజేస్తారు. ఆఫీస్ నుంచి పని చేయాల్సి ఉంటుంది. తక్షణం చేరాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మే 22 మధ్య ఇంటర్న్‌షిప్ ఉంటుంది. 12 ఓపెనింగ్లు ఉన్నాయి . https://internshala.com/internship/detail/business-development-sales-internship-in-multiple-locations-at-southern-trading-company-stiora1649327206 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
A plus R వద్ద సోషల్ మీడియా మార్కెటింగ్
ఈ ఆర్కిటెక్చర్ సంస్థ ఇంటర్న్‌లను హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల నుంచి పని చేయడానికి ఆహ్వానిస్తోంది. ఆఫీసు నుంచి పని చేయాల్సి ఉంటుంది. మూడు నెలల ఇంటర్న్‌షిప్‌లో మే 3వ తేదీలోపు చేరవచ్చు. నెలకు రూ.4000 నుంచి రూ.8000 స్టైఫండ్ అందుతుంది. సర్టిఫికేట్, సిఫార్సు లేఖలను పరిశీలిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 2022 ఏప్రిల్ 13 నుంచి.. https://internshala.com/internship/detail/social-media-marketing-internship-in-multiple-locations-at-a-plus-r1648565608లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రోరిడా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో గ్రాఫిక్ డిజైన్
మొబైల్ యాప్ డెవలప్మెంట్ గ్రాఫిక్స్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఆఫీస్ నుంచి వర్క్ చేయాల్సి ఉంటుంది.
Jobs in Telangana: సింగరేణి కొలరీస్లో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూలు
మూడు నెలల ఇంటర్న్‌షిప్‌లో ఏప్రిల్ 7 నుంచి మే 12 మధ్య చేరవచ్చు. ఇంటర్న్షిప్లోని పోస్ట్‌లు, పోస్టర్లు, సోషల్ మీడియా కోసం ఫ్లైయర్లను రూపొందించడం, యూట్యూబ్‌లో ప్రచురించే ముందు వీడియోలను సవరించడం వంటివి ఉంటాయి. నెలకు రూ. 3,000 స్టైఫండ్ ఇస్తారు. సిఫార్సుకు అవకాశం ఉంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 22. https://internshala.com/internship/detail/graphic-design-part-time-job-internship-at-hyderabad-in-rorida-technologies-private-limited1649339711 లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.