హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Eamcet Counseling 2022: రేపు జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా.. మళ్లీ ఎప్పటి నుంచి ప్రారభం అవుతాయంటే..

Eamcet Counseling 2022: రేపు జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా.. మళ్లీ ఎప్పటి నుంచి ప్రారభం అవుతాయంటే..

Eamcet Counseling 2022: రేపు జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా.. మళ్లీ ఎప్పటి నుంచి ప్రారభం అవుతాయంటే..

Eamcet Counseling 2022: రేపు జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా.. మళ్లీ ఎప్పటి నుంచి ప్రారభం అవుతాయంటే..

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను(Eamcet Counseling) వాయిదా పడింది. ఇంజినీరింగ్ ఫీజుల(Engineering Fees) విషయం కొలిక్కి రాకపోవడంతో రేపటి(సెప్టెంబర్ 28) నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను(Eamcet Counseling) వాయిదా పడింది. ఇంజినీరింగ్ ఫీజుల(Engineering Fees) విషయం కొలిక్కి రాకపోవడంతో రేపటి(సెప్టెంబర్ 28) నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ఈ కౌన్సెలింగ్‌ అక్టోబరు 11 నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. అక్టోబర్ 11, 12న రెండో విడత స్లాట్ బుకింగ్ మొదలవుతుంది. అలాగే అక్టోబర్ 12న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా అక్టోబరు 12, 13న వెబ్ అప్షన్ల నమోదు ప్రక్రియ, అక్టోబరు 16న సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఇక తుది విడత కౌన్సెలింగ్(Counseling) అక్టోబరు 11 నుంచి జరగాల్సి ఉండగా.. ఈ తేదీల్లో ప్రస్తతుం మార్పులు జరగనున్నాయి. స్పాట్‌ ఆడ్మిషన్లు అనేవి అక్టోబర్‌ చివరి వారంలో ఉండే అవకాశం ఉంటుంది.

సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్స్

- టీఎస్ ఎంసెట్-2022 ర్యాంక్ కార్డ్

- టీఎస్ ఎంసెట్ -2022 హాల్ టికెట్

- ఆధార్ కార్డ్

- S.S.C లేదా అందుకు సమానమైన మార్కుల మెమో

- ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైన మెమో-కమ్-పాస్ సర్టిఫికేట్

- ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (T.C)

- 01-01-2022న లేదా ఆ తర్వాత జారీ చేసిన ఇన్ కమ్ సర్టిఫికేట్ (వర్తిస్తే)

- తహసీల్దార్ జారీ చేసిన EWS ఇన్‌కమ్ సర్టిఫికేట్, 2022-23 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యేది. (వర్తిస్తే)

- అధికారులు జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్

- అభ్యర్థికి ఇన్‌స్టిట్యూషల్ ఎడ్యుకేషన్ లేనిపక్షంలో అర్హత పరీక్షకు ముందు 7 సంవత్సరాల కాలానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్

- స్థానికేతర అభ్యర్థులకు సంబంధించి, అన్‌రిజర్వ్‌డ్ సీట్ల కింద కేటాయింపు కోసం వారిని పరిగణనలోకి తీసుకోవాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

Bank Jobs 2022: IDBI, SBI, NABARD పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి.. ఆ వివరాలిలా.. 

ఈసారి మూడు విడతల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ పూర్తిచేయనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. మొదటి దశ కౌన్సెలింగ్ లో విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల కోసం ఎక్కువ ఎంపిక చేసుకున్నారు. ఈ కోర్సుల్లోని 41,506 సీట్లు ఉండగా 40,878 సీట్లు భర్తీ అయ్యాయి. అంటే 98.49 శాతం కేటాయించారు.

Jobs In NIIH: స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. జీతం రూ. 64వేలు..

కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 100 శాతం సీట్ల కేటాయింపులు జరిగాయి. కాగా, తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు ఆగస్టు 12న విడుదలయ్యాయి. ఎసెంట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 88.34 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, TS EAMCET 2022

ఉత్తమ కథలు