హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS EAMCET Exam: ఎంసెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు ముఖ్య సూచన.. కీలక ప్రకటన విడుదల..

TS EAMCET Exam: ఎంసెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు ముఖ్య సూచన.. కీలక ప్రకటన విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా విద్యాసంస్థలకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అన్ని పరీక్షలకు వాయిదా వేసింది.

ఇంకా చదవండి ...

ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్(Agriculture), మెడికల్ పరీక్షలను(Medical Exam) వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా విద్యాసంస్థలకు వారం రోజుల పాటు సెలవులు(Holidays) ప్రకటించిన ప్రభుత్వం(Government) అన్ని పరీక్షలకు వాయిదా వేసింది. జూలై 18 నుంచి విద్యాసంస్థలు ఓపెన్(Open) కానున్నాయి. వర్షాలు(Rains) రాకముందే హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ (Hall Tickets Download) చేసుకున్న అభ్యర్థులకు నిరాశ తప్పలేదు. భారీ వర్షాల నేపథ్యంలో సొంతూళ్ల నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు(Students) చేరుకోవడం కష్టం అని.. అందుకనే ఎంసెట్ అగ్రికల్చర్(Eamcet Agriculture), మెడికల్ పరీక్ష(Medical Exam) వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ విభాగం పరీక్షా తేదీలలో ఎలాంటి మార్పు లేదని, షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ రెండు రోజుల క్రితం తెలిపారు.

Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. మరో నోటిఫికేషన్ విడుదల..


తాజాగా దీనిపై ఓ అప్ డేట్ వచ్చింది. అందేంటంటే.. తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS EAMCET 2022) ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ ఈ నెల 18వ తేదీ నుంచి యథాతథంగా జరగనున్నట్లు ఉన్నత విద్యా మండలి శనివారం (జులై 16) వెల్లడించింది. అయితే ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష ఎప్పుడు నిర్వహించనున్నారనే తేదీలను మాత్రం వెల్లడించలేదు. జూలై 18, 19, 20 తేదీల్లో రెండు సెషన్లలో ఈ పరీక్షలు ఉంటాయన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం సెషన్‌ పరీక్ష 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఒక్కో సెషన్‌కు 29 వేల మంది విద్యార్ధులు హాజరవుతారు.

ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరుగనున్నాయి. దీని కోసం తెలంగాణలో 89, ఏపీలో 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్ధులకు జారీ చేసిన హాల్‌ టికెట్లలో అన్ని సూచనలు జారీ చేశామని, వాటిని తప్పక అనుసరించాలని అధికారులు తెలిపారు. ఎంసెట్(EAMCET) ప‌రీక్షను జేఎన్‌టీయూ, హైద‌రాబాద్‌ నిర్వహిస్తుంది. టెక్నాలజీ, ఇంజినీరింగ్(Engineering Courses) కోర్సుల్లో ప్రవేశాలు పొంద‌డానికి అభ్యర్థులు ఇంటర్ లో మ్యాథ‌మెటిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యోటెక్నాల‌జీ, బ‌యోల‌జీ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి.

హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.

Step 1 : ఎంసెట్ వెబ్‌సైట్ eamcet.tsche.ac.in ఓపెన్ చేయండి

Step 2 : వెబ్‌సైట్ హోం పేజీలో 'Hall Ticket Download' ఆప్షన్‌పై క్లిక్ చేయండి

Step 3 : అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్మిట్ చేయండి

Step 4 : స్క్రీన్‌పై హాల్ టికెట్ డిస్‌ప్లే అవుతుంది. హాల్ టికెట్‌పై అభ్యర్థి వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి .

Step 5 : హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ ఇదే..

ఎంసెట్ మార్కుల ఆధారంగానే..

ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణత(Intermediate) సాధించిన విద్యార్థులు ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్‌, మెడిక‌ల్ కోర్సులో చేరేందుకు ఎంసెట్ పరీక్ష రాయాల్సి ఉంది. ఎంసెట్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ సారి ర్యాంక్ లను కేటాయించనున్నారు. ఇంటర్ మార్కుల వెయిటేజీని(25 శాతం) ఈ సారి రద్దు చేశారు. అయితే ఇంటర్ లో జనరల్ అభ్యర్థులు 45 శాతం, రిజర్వేషన్ అభ్యర్థులకు 40 శాతం మార్కులు రావాలి.

First published:

Tags: Career and Courses, JOBS, Ts eamcet, TS EAMCET 2022

ఉత్తమ కథలు