TS EAMCET Results : తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడంటే..

TS EAMCET | జూన్ మొదటివారంలో రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నట్లు ముందుగా అధికారులు ప్రకటించారు. ఆ విధంగానే ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. కాబట్టి.. తెలంగాణలోనూ ఎంసెట్ రిజల్ట్స్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 4, 2019, 5:03 PM IST
TS EAMCET Results : తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇక తరువాయి తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్స్ విడుదలే. నిజానికీ ఫలితాలు ఎప్పుడో విడుదల కావాల్సింది. అయితే, తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌‌లో ఏర్పడిన గందరగోళం వల్ల రీ వాల్యూయేషన్ తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలుగురాష్ట్రాల్లో ఎంసెట్ రిజల్ట్స్ పలుమార్లు వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలోనే జూన్ మొదటివారంలో రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నట్లు ముందుగా అధికారులు ప్రకటించారు. ఆ విధంగానే ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. కాబట్టి.. తెలంగాణలోనూ ఎంసెట్ రిజల్ట్స్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఇంటర్ రీవాల్యూయేషన్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ మార్కులు ఎంసెట్ ర్యాంకుల్లో వెయిటేజీ ఉండడంతోనే ఫలితాల ప్రకటనకు ఆలస్యమైంది. ఇప్పుడు రీవాల్యూయేషన్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అవడంతో త్వరలోనే తెలంగాణలో రిజల్ట్స్ విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

EAMCET Counselling : ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి..కౌన్సెలింగ్‌కి సిద్ధమవ్వండిలా..

AP EAMCET Results 2019: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. 
First published: June 4, 2019, 5:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading