TS EAMCET Counselling 2019 : 24 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్.. ముఖ్యతేదీలు ఇవే..

TS EAMCET Counselling 2019 | కౌన్సెలింగ్ ప్రక్రియకు విద్యార్థులు ఏ రోజు.. ఏ సమయానికి వస్తారో వారే నిర్ణయించుకోవచ్చు. జులై 6న ఈ సీట్ల కేటాయింపు చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ నెల 24న అఫీషియల్ వెబ్‌సైట్ tseamcet.nic.in‌లో పొందుపరుస్తామని అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: June 21, 2019, 12:20 PM IST
TS EAMCET Counselling 2019 : 24 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్.. ముఖ్యతేదీలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 21, 2019, 12:20 PM IST
ఈ నెల 24 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ జరుగనుంది. ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తీర్ణులైన ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశం కోసం కౌన్సెలింగ్ జరుగనుంది. మొదటి విడత జులై 12 వరకూ కొనసాగనుంది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియకు విద్యార్థులు ఏ రోజు.. ఏ సమయానికి వస్తారో వారే నిర్ణయించుకోవచ్చు. జులై 6న ఈ సీట్ల కేటాయింపు చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ నెల 24న అఫీషియల్ వెబ్‌సైట్ tseamcet.nic.in‌లో పొందుపరుస్తామని అధికారులు తెలిపారు.

అయితే, గతేడాది వరకు ధ్రువపత్రాల పరిశీలన కోసం ఏ రోజు హాజరుకావాలో అధికారులే నిర్ణయించేవారు..కానీ.. ఈ ఏడాది నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో.. ఏ రోజు, ఏ హెల్ప్ లైన్ సెంటర్‌కి ఏ సమయంలో వెళ్తారో వెబ్‌సైట్ నుంచి ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ప్రతి 2 గంటలకు ఒక స్లాట్ ఉంటుంది. అంటే.. విద్యార్థి ధ్రువపత్రాల పరిశీలనకు 2 గంటలకు మించి పట్టదు.

కౌన్సెలింగ్ కోసం ఈ నెల 24 నుంచి జులై 1 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం పూర్తి చేయడం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

27 నుంచి జులై 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన


27 నుంచి జులై 4 వరకు కాలేజీలు, కోర్సులు ఎంచుకోచ్చు.
జులై 6న సీట్ల కేటాయింపు..
జులై 6 నుంచి 12 వరకు వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్, ట్యూషన్ పీజు చెల్లించొచ్చు.
Loading...
ఇవి కూడా చదవండి..

EAMCET Counselling : ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి..కౌన్సెలింగ్‌కి సిద్ధమవ్వండిలా..
First published: June 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...