కరోనా పరిస్థితుల నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ ను అధికారులు నిర్వహించారు. అయితే. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని ఇటీవల అధికారులు విడుదల చేశారు. ఈ ఆన్సర్ కీపై అభ్యంతరాలను తెలిపేందుకు ఈ నెల 14 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అధికారులు గడువు విధించారు. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను అధికారుల కమిటీ పరిశీలించనుంది. అభ్యంతరాల్లో సహేతుకత ఉంటే వాటిని పరిగణలోకి తీసుకుని కీలో మార్పులు చేయనున్నారు. లేకపోతే పరిగణలోకి తీసుకోరు. అభ్యంతరాల అనంతరం తుది కీని విడుదల చేసి.. తర్వాత ఫలితాలను విడుదల చేస్తారు. TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. కీ విడుదల.. వివరాలివే TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ సారి ర్యాంకుల కేటాయింపులో మార్పులు.. తెలుసుకోండి
TS EAMCET 2021 Answer Keyని ఈ స్టెప్స్ తో డౌన్ లోడ్ చేయండి..
1. అభ్యర్థులు మొదటగా eamcet.tsche.ac.in ను ఓపెన్ చేయండి
2.అనంతరం హోం పేజీలో ‘Master Question Papers & Preliminary Keys (E)’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3.అక్కడ డేట్లు, సెషన్ల వారీగా పరీక్ష పేపర్లు, కీకి సంబంధించిన లింక్ లు కనిపిస్తాయి.
4.ఆ లింక్ లపై క్లిక్ చేసి కీని చూసుకోవచ్చు.
అభ్యంతరాలను తెలియజేయండిలా..
మీకు కీపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇలా తెలియజేయాలి.
1.అభ్యంతరాలు మొదటగా https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_KeyObjections.aspx లింక్ పై క్లిక్ చేయాలి.
2.రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన రోజు వివరాలను నమోదు చేసి వెబ్ సైట్లోకి లాగిన్ అవ్వాలి.
3.అనంతరం విద్యార్థులు అభ్యంతరాలను తెలపొచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.