ఈ రోజుల్లో చాలా మంది విద్యార్థులు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ లో (Engineering Course) చేరడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే.. ఎంసెట్ (EAMCET Exam) రాయని వారు.. రాసినా క్వాలిఫై కాని వారు, ఇంకా.. క్వాలిఫై అయి వివిధ కారణాలతో ఎంసెట్ కౌన్సెలింగ్ కు హాజరు కాని వారు ఇంజనీరింగ్ లో ఎలా చేరాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. వారికి ఓ గుడ్ న్యూస్. తాజాగా ఎంసెట్ స్పాట్ అడ్మిషన్ల కు (EAMCET Spot Admissions) సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు అధికారులు. అయితే.. ఈ విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం వర్తించదు. ఆయా విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉంటే బుధ, గురువారాల్లో ఎంసెట్ స్పాట్ అడ్మిషన్స్ ద్వారా సీటును పొందే అవకాశాన్ని కల్పించారు తెలంగాణ ఎంసెట్ అధికారులు. ఈ నెల 3వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఉంటుంది.
ఈ ఏడాది బీటెక్‌లో 63, 899 సీట్లు కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయి. అయితే సీట్లు పొందిన విద్యార్థుల్లో ఇప్పటివరకు 57,500 మంది మాత్రమే ఫీజు చెల్లించి, వారు సీటు పొందిన కాలేజీల్లో రిపోర్ట్ చేశారు. దీంతో 6,399 వరకు సీట్లు మిగిలిపోయాయి. అయితే.. కౌన్సెలింగ్‌లో భర్తీ కాని సీట్లు మరో 19,421 ఉన్నాయి. దీంతో ఈ మొత్తం 25 వేల సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారానే భర్తీ చేయనున్నారు.
Best Career Option: ఈ రంగంలో కెరీర్ ప్రారంభిస్తే.. రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు జీతం పొందొచ్చు..
ఎంసెట్ స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్..
- ఈ ఖాళీ సీట్లను మొదటగా ఎంసెట్‌లో క్వాలిఫై అయ్యి.. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులతో భర్తీ చేస్తారు. అనంతరం మిగిలన సీట్లను ఎంసెట్ రాయని విద్యార్థులతో భర్తీ చేస్తారు.
- ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కౌన్సెలింగ్ కు అనర్హులు.
- ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్న విద్యార్థులకు మాత్రమే స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించనున్నారు. అయితే.. సర్టిఫికెట్లను పరిశీలించి విద్యార్థులకు తిరిగి ఇచ్చేయనున్నారు. ఒక్క ఒరిజినల్ టీసీతో పాటు జిరాక్స్ పత్రాలను మాత్రమే స్పాట్ అడ్మిషన్ సమయంలో తీసుకుంటారు.
- అయితే.. విద్యార్థులు పొందిన అడ్మిషన్ ను ఎంసెట్ కన్వీనర్ ధ్రువీకరించాల్సి ఉంది. ధ్రువీకరణ పొందిన తర్వాతనే అడ్మిషన్లు పొందినట్లు కన్ఫార్మ్ అవ్వాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Admissions, Career and Courses, JOBS, TS EAMCET 2022