హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS EAMCET 2022 Key: తెలంగాణ ఎంసెట్ ప్రైమరీ కీ విడుదల.. ఈ లింక్ తో డౌన్ లోడ్.. మరి రిజల్ట్స్ ఎప్పుడంటే?

TS EAMCET 2022 Key: తెలంగాణ ఎంసెట్ ప్రైమరీ కీ విడుదల.. ఈ లింక్ తో డౌన్ లోడ్.. మరి రిజల్ట్స్ ఎప్పుడంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఇంజనీరింగ్ తో పాటు వివిధ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ పరీక్షకు (TS EAMCET 2022) సంబంధించిన ప్రైమరీ కీని అధికారులు తాజాగా విడుదల చేశారు.

తెలంగాణలో ఇంజనీరింగ్ తో పాటు వివిధ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీని అధికారులు తాజాగా విడుదల చేశారు. అభ్యర్థులు ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.ac.in వెబ్ సైట్ నుంచి కీ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కీతో పాటు ప్రశ్నాపత్రాలు, విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను సైతం అందుబాటులో ఉంచారు అధికారులు. అయితే.. ఈ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఎంసెట్ (TS EAMCET 2022) అధికారులు సూచించారు. అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ అంటే సోమవారం సాయంత్రం 5 గంటలలోపు వెబ్ సైట్లోని లింక్ ద్వారా తమ అభ్యంతరాలను సమర్పించాలని సూచించారు. అయితే ఎంసెట్ రిజల్ట్స్ ను మరో వారంలో విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 7వ తేదీలోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

అభ్యర్థులు ఈ స్టెప్స్ తో తమ రెస్పాన్స్ షీట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

Step 1: మొదటగా ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ (https://eamcet.tsche.ac.in/) ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం Download Response Sheet (E) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

దీంతో మీ రెస్పాన్స్ షీట్ హోం స్క్రీన్ పై కనిస్తుంది.

Step 3: ఆ షీట్లో ప్రశ్నాపత్రం, సరైన సమాధానం, మీరు ఎంపిక చేసుకున్న సమాధానం కనిపిస్తాయి. దీంతో మీకు వచ్చే మార్కులను కౌంట్ చేసుకోవచ్చు.

Exams: కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి

- అభ్యర్థులు ఈ లింక్ ద్వారా మాస్టర్ క్వశ్చన్స్ పేపర్స్, ఆన్సర్ కీని నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

- అభ్యర్థులు ఈ లింక్ ద్వారా కీ పై తమ అభ్యంతరాలను తెలపవచ్చు.

-ఇదిలా ఉంటే.. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ను నిర్వహించారు. అయితే.. వర్షాల కారణంగా అగ్రికల్చర్ విభాగానికి సంబంధించిన పరీక్షలను వాయిదా వేశారు. ఆ పరీక్షలను ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహిస్తున్నారు. దీంతో నిన్న ఆ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. నేటితో అగ్రికల్చర్ పరీక్షలు ముగియనున్నాయి.

First published:

Tags: Exams, JOBS, TS EAMCET 2022

ఉత్తమ కథలు