Home /News /jobs /

TS EAMCET 2022 IMD FORECASTS HEAVY RAINS IN TELANGANA DUE TO BAD WEATHER EAMCET POSTPONED SK

TS EAMCET: ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా.. పూర్తి వివరాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS EAMCET 2022: ఇప్పటికీ వర్షాలు తగ్గకపోవడం.. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో.. ఇప్పుడు ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా పడ్డాయి.

    తెలంగాణలో భారీ వర్షాల (Telangana Heavy Rains) నేపథ్యంలో ఎంసెట్ (Telangana EAMCET) అగ్రికల్చర్ పరీక్ష వాయిదా పడింది. రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేయడంతో.. జులై 14, 15 తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ (TS EAMCET 2022) అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. కేవలం అగ్రికల్చర్ పరీక్ష (TS EAMCET Agriculture Exam)ను మాత్రమే వాయిదా వేస్తున్నామని.. ఇంజినీరింగ్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని వెల్లడించింది. జులై 18 నుంచి 20 వరకు జరగాల్సి ఉన్న ఇంజినీరింగ్ పరీక్షల(TS EAMCET Engineering Exam)ను యథావిధిగా నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. వాయిదా పడిన అగ్రికల్చర్ పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఉన్న విద్యామండలి తెలిపింది.

    TS EAMCET Chemistry Tips: తెలంగాణ ఎంసెట్ కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే.. కెమిస్ట్రీలో మంచి స్కోర్ కోసం ఇలా చదవండి



    షెడ్యూల్ ప్రకారం జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్‌, మెడిసన్‌ పరీక్షలు.. 18, 19, 20 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణ వారం రోజులుగా ఎడతెరిపి లేకుందా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో చాలా జిల్లాల్లో ఎంసెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేయలేదు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఎంసెట్ కేంద్రాలు సైతం నీట మునిగాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో.. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల డిమాండ్లు, వాతావరణశాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి.. ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది.



    కాగా, భారీ వర్షాల కారణంగా తెలంగాణలో ఇప్పటికే మూడు రోజులుగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. యూనివర్సిటీల్లో పరీక్షలు కూడా రద్దయ్యాయి. జేఎన్టీయూహెచ్ (JNTUH), ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University), కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University), మహాత్మా గాంధీ యూనివర్సిటీ (Mahatma Gandhi University)లు పరీక్షలను వాయిదా వేశాయి. ఇప్పటికీ వర్షాలు తగ్గకపోవడం.. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో.. ఇప్పుడు ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష కూడా వాయిదా పడ్డాయి. ఇంజినీరింగ్ పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయి. ఈసారి తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షకు 1,17,500 దరఖాస్తులు, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 94,047 దరఖాస్తులు వచ్చాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: EDUCATION, Telangana, Ts eamcet, TS EAMCET 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు