Home /News /jobs /

TS EAMCET 2022 HERE IS THE PREPARATION TIPS FOR STUDENTS NS MBNR

TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్ కు అప్లై చేశారా? అయితే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఎంసెట్ కు (TS EAMCET) సంబంధించిన హాల్ టికెట్లను ఇప్పటికే అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ ఎగ్జామ్ కు సంబంధించిన పలు విషయాలు విద్యార్థుల కోసం..

    (సేకరణ: న్యూస్ 18 ప్రతినిధి, మహబూబ్ నగర్)
    రచయిత:  G. రమేష్, ఎంసెట్ కోచింగ్ అధ్యాపకులు, జంతుశాస్త్రం అధ్యాపకులు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, జడ్చర్ల 

    తెలంగాణలో ఎంసెట్ (TS EAMCET 2022) ఎగ్జామ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లే చేస్తున్నారు. విద్యార్థులు సైతం ప్రిపరేషన్ లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం ఎంసెట్ ఎగ్జామ్ కు (Exam) సంబంధించిన సమగ్ర వివరాలు.. ఎంసెట్ పరీక్షకు సంబంధించి మొత్తం 160 మార్కులు ఉంటాయి ఉదాహరణకు అగ్రికల్చర్ తీసుకున్నట్లయితే అందులో నాలుగు సబ్జెక్టులు ఉంటాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ ఎంసెట్ కోచింగ్ ఉపాధ్యాయులు జి రమేష్ అన్నారు. అగ్రికల్చర్ ఎంసెట్ ఎగ్జామ్ (EAMCET Exam) రాసేవారు మొత్తము నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా నాలుగు సబ్జెక్టులు కలిపి ప్రతిదానికి 40 మార్కుల చొప్పున నూట అరవై మార్కులు మొత్తంలో ఉంటాయని ఆయన అన్నారు. 100% సిలబస్లో 70 శాతం సిలబస్ ఉంటుందని 30 శాతం మినహాయింపు ఇచ్చారని ఆయన అన్నారు. గత సంవత్సరం పాత పేపర్లను ఒకసారి చూసుకున్నట్లయితే పూర్తిస్థాయిలో మోడల్ పేపర్ చదవడం వల్ల పరీక్ష చాలా సులువుగా రాసే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

    ఎంసెట్ పరీక్షలు 160 మార్కులకు ఉంటయాని వివరించారు. నెగిటివ్ మార్కులు ఉండవని పరీక్ష పత్రం 160 మార్కులకు అన్ని జవాబులు రాయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. గత 2, 3 సంవత్సరాల నుంచి  ఎంసెట్ పరీక్ష ఆఫ్ లైన్  లో కాకుండా ఆన్ ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహిస్తున్నారని, అంతేకాక ఎంసెట్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే పరీక్ష నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు టైం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి టైం ప్రకారం గా ప్రశ్నలు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.
    TS EAMCET - 2022 Hall Ticket Download: తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఆన్లైన్లో హాల్ టికెట్లు.. ఈ లింక్ తో డౌన్‌లోడ్ చేసుకోండి

    టైం వృథా ఎక్కువగా చేయకుండా ఆలోచించి త్వరగా జవాబులు ఇచ్చినట్లయితే బాగుంటుందని ఆయన అన్నారు. గత రెండు మూడు సంవత్సరాల నుండి ఎంసెట్ పరీక్షకు సంబంధించి కొద్దిగా కఠినంగానే ప్రశ్నపత్రం వస్తుందని అన్నారు. అందుకే ప్రతి ఒక్క విద్యార్థి సబ్జెక్టుపై అవగాహన పెంచుకుని ఒకటికి పది సార్లు మోడల్ పేపర్ ల ద్వారా ప్రాక్టీస్ చేసినట్లయితే పరీక్ష పత్రానికి సులువుగా సమాధానం రాసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Exams, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు