Home /News /jobs /

TS EAMCET 2022 HERE IS THE IMPORTANT UPDATE ABOUT RESULTS NS

TS EAMCET 2022 Results: తెలంగాణ ఎంసెట్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక అప్ డేట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఎంసెట్ ఫలితాలకు (TS EAMCET Results) సంబంధించి అధికారులు తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2022) ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్ డేట్. ఫలితాలను (TS EAMCET 2022 Results) వచ్చే వారం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ వెల్లడించారు. ఫలితాలను నవంబర్ 1వ తేదీ నుంచి ఇంజనీరింగ్ కు సంబంధించిన తరగతులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎంసెట్ ఫలితాలు విడుదలైన నాటి నుంచి వారం పదిరోజుల్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ (EAMCET Counselling) ను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సారి ఇంజనీరింగ్ కు సంబంధించి 1.56 లక్షల మంది విద్యార్థులు, అగ్రికల్చర్ కు సంబంధించి మొత్తం 80 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

    తెలంగాణలో ఇంజనీరింగ్ తో పాటు వివిధ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీని అధికారులు తాజాగా విడుదల చేశారు. అభ్యర్థులు ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.ac.in వెబ్ సైట్ నుంచి కీ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కీతో పాటు ప్రశ్నాపత్రాలు, విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను సైతం అందుబాటులో ఉంచారు అధికారులు.
    TSLPRB SI Questions Analysis: పూర్తయిన TS SI ప్రిలిమినరీ పరీక్ష.. ప్రశ్నల స్థాయి ఎలా ఉందంటే..

    అభ్యర్థులు ఈ స్టెప్స్ తో తమ రెస్పాన్స్ షీట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
    Step 1: మొదటగా ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ (https://eamcet.tsche.ac.in/) ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Download Response Sheet (E) ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ రెస్పాన్స్ షీట్ హోం స్క్రీన్ పై కనిస్తుంది.
    Step 3: ఆ షీట్లో ప్రశ్నాపత్రం, సరైన సమాధానం, మీరు ఎంపిక చేసుకున్న సమాధానం కనిపిస్తాయి. దీంతో మీకు వచ్చే మార్కులను కౌంట్ చేసుకోవచ్చు.


    - అభ్యర్థులు ఈ లింక్ ద్వారా మాస్టర్ క్వశ్చన్స్ పేపర్స్, ఆన్సర్ కీని నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
    - అభ్యర్థులు ఈ లింక్ ద్వారా కీ పై తమ అభ్యంతరాలను తెలపవచ్చు.
    ఇదిలా ఉంటే.. జులై 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ను నిర్వహించారు. అయితే.. వర్షాల కారణంగా అగ్రికల్చర్ విభాగానికి సంబంధించిన పరీక్షలను వాయిదా వేశారు. ఆ పరీక్షలను ఆగస్టు 30, 31 తేదీల్లో నిర్వహించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Exam results, Exams, TS EAMCET 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు