హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS EAMCET Chemistry Tips: తెలంగాణ ఎంసెట్ కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే.. కెమిస్ట్రీలో మంచి స్కోర్ కోసం ఇలా చదవండి

TS EAMCET Chemistry Tips: తెలంగాణ ఎంసెట్ కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే.. కెమిస్ట్రీలో మంచి స్కోర్ కోసం ఇలా చదవండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎంసెట్ ఎగ్జామ్స్ (TS EAMCET 2022) లో కెమిస్ట్రీ లో ఎక్కువ మార్కులు సాదించాలంటే ఎం చేయాలి? నిపుణుల సూచనలు సలహాలు..

  (శ్రీనివాస్, న్యూస్ 18 కరస్పాండెంట్, కరీంనగర్)

  మరికొద్ది రోజుల్లో TS EAMCET ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.అయితే ఈ  పరీక్ష లో కెమిస్ట్రీ నుండి మంచి మార్కులు సాధించాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి ... ఎలా ప్రీపేర్ అవాలి అనేదానిపై కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అల్లం సాయి కృష్ణ  సార్ యొక్క అభ్యర్థులకు టిప్స్ (EAMCET TIPS) అండ్ సూచనలు అవేంటో ఒకసారి చూద్దాం . కెమిస్ట్రీకి  అనగానే చాలామంది విద్యార్థుల్లో భయం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బండింగ్స్, సమీకరణాలు.. ఫార్ములాలు అని ఇలా ఏవేవో ఉంటాయి. వాటికి బయపడకుండా చదివితే విజయం మన సొంతం అవుతుంది అంటున్నారు. నిపుణులు..కెమిస్ట్రీలో అసలు ఎ సిలబస్ నుండి ఎక్కువగా మార్కులు వస్తయి.. ఎలా ప్రిపేర్ (Exams Preparation) అవ్వాలి అయ్యే విషయానికి వస్తే ,ముందుగా సిలబస్ చూసుకుంటే అణువులు, అండ్ సమీకరణాల, గురించి , అభ్యర్థులు p- బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ అటామిక్ స్ట్రక్చర్ వంటి ముఖ్యమైన అంశాలను సమర్ధవంతంగా ప్రిపేర్ అయితే చాలా మంచి మార్కులు సాధించొచ్చు. సమీకరణాలు, రసాయనాలు మరియు పార్ములాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

  కెమిస్ట్రీ లో ఎక్కువగా  సూత్రాలు, పార్ములాలు ,చర్యలు, ప్రతిచర్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువగా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక బుక్స్ విషయానికి వస్తే తెలుగు అకాడమీ కెమిస్ట్రీ పుస్తకం ను ఫాలో అయితే మంచిది .పదవతరగతి, ఇంటర్ మీడియట్ పుస్తకాలనుఎక్కువ చదివి, రివైజ్ చేయడం మంచి ప్రిపరేషన్కు ఆధారం అని చెప్పవచును . రివైజ్ చేసేటప్పుడు నోట్స్ రాసుకోని మల్లీ ఒకసారి చదువుకుంటే సరిపోతుంది .ఇలా చదువుతు ప్రతి రోజు గ్రాండ్ టెస్ట్ లు, మక్ టెస్ట్ లు రాస్తే మంచి మార్కులు సాధించవచ్చు ఎక్కువ స్క్రోరు వస్తే మంచి కాలేజీ సిటు వస్తుంది.మంచి భవిష్యత్తు మంచి జాబ్ కూడా సంపాధించుకోవచ్చు. పరీక్షకు వెళ్ళే ముందు చాల మంది గుర్తుంచుకోవలసిన విషయాలు.

  TS EAMCET Physics Tips: తెలంగాణ ఎంసెట్ కు అప్లై చేశారా..? ఫిజిక్స్ లో మంచి మార్కులకు ఈ టిప్స్

  అభ్యర్థులు ముందు తమ సిలబస్ని తెలుసుకోవాలి . సిలబస్ లో ప్రతి పాఠం నుండి ముఖ్యమైన అంశాలను గుర్తించాలి . టాపిక్ ల వారీగా వెయిటేజీ అభ్యర్థులు ఇతరుల కంటే ఏ టాపిక్లు ముఖ్యమైనవో తెలుసుకోవడంలో సహాయపడతాయి . వేర్వేరు పరీక్షలకు అభ్యర్థులు వేర్వేరుగా చదువుకోవాలి . పరీక్షా విధానం మరియు ప్రశ్నల క్లిష్ట స్థాయి గురించి స్పష్టమైన ఆలోచన కలిగి ఉండటం వల్ల అభ్యర్థులు చదువుతున్నప్పుడు ఏ అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకోవచ్చు. అదనంగా, అభ్యర్థులు ప్రతీ సబ్జెక్టుకు సంబంధించి పూర్తిగా విశ్లేషించుకుంటే .. ఎంసెట్ లో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు కెమిస్ట్రీ సీనియర్ ఫ్యాకల్టీ అల్లం సాయికృష్ణ సార్..

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Exam Tips, Exams, JOBS

  ఉత్తమ కథలు