సేకరణ: లెనిన్, న్యూస్18 ప్రతినిధి, ఆదిలాబాద్
ఇదీ పరీక్షా కాలం.. పరీక్షలు (Exams) అనగానే విద్యార్థుల్లో తెలియని ఆందోళన, భయం నెలకొనడం సహజం. అయితే పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించాలంటే ముందు ఆ భయాన్ని పక్కనపెట్టి, ప్రణాళిక బద్దంగా ఒక క్రమ పద్దతిలో సన్నద్ధమయితే పరీక్షల్లో విజయం సాధించవచ్చని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎంసెట్ పరీక్ష (TS EAMCET 2022) విషయంలో విద్యార్థులు ఈ యేడు జరిగిన మార్పులను క్షుణ్ణంగా గమనించి, తదనుగుణంగా సాధన చేయాలని అంటున్నారు ఆదిలాబాద్ లోని స్టార్-50 జువాలజి (TS EAMCET 2022 Zoology) ఫ్యాకల్టీ ప్రియాంక చింతల. ఎంసెట్ కు సిద్దమవుతున్న విద్యార్థులు ఏయే అంశాలపై దృష్టి సారించాలని, వేటికి ప్రాధాన్యమివ్వాలి, పరీక్షా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి నిబంధనలు పాటించాలో న్యూస్ 18 తో పంచుకున్నారు. గత రెండేళ్ళుగా కరోనా నేపథ్యంలో పరీక్షలకు నోచుకోని విద్యార్థులకు ప్రభుత్వం ఈ యేడు కొన్ని మార్పులు, చేర్పులతో పరీక్షలు నిర్వహిస్తోంది. వాటికి సంబంధించి ప్రియాంక చింతల తెలిపిన వివరాలు… ముఖ్యంగా ఎంసెట్ పరీక్షకు సంబంధించిన తేదీలను ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
జూలై 14, 15, 18, 19, 20వ తేదీల్లో ఈ ఎంసెట్ పరీక్షను నిర్వహించబోతున్నారు. అయితే ఈసారి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన అందరు విద్యార్థులకు ఇంటర్మీడియెట్ లో వచ్చిన మార్కుల పర్సెంటేజీతో పనిలేకుండా ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే వివిధ పోటీ పరీక్షల్లో ఇటీవల కాలంలో నెగెటివ్ మార్కులు ఉంటున్నాయి. కానీ ఈ సారి ఎంసెట్ లో ఈ నెగెటివ్ మార్కులను తీసేశారు, మార్కులు కట్ చేయబడవు. ఎం.పీ.సీ విద్యార్థులకు 160 ప్రశ్నలు ఉంటాయి.
TS EAMCET TIPS: ఎంసెట్ ప్రిపరేషన్స్.. Mathematics లో మంచి స్కోర్ కోసం ఈ టిప్స్ పాటించండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.