TS EAMCET 2022 HALL TICKETS RELEASED IN WWW EAMCET TSCHE AC IN HERE IS DIRECT LINK TO DOWNLOAD NS
TS EAMCET - 2022 Hall Ticket Download: తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఆన్లైన్లో హాల్ టికెట్లు.. ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ ఎంసెట్ కు సంబంధించిన హాల్ టికెట్లను (TS EAMCET Hall tickets) అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఈ లింక్ తో తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2022) ఎగ్జామ్ కు అప్లై చేశారా? అయితే.. మీకో ముఖ్యమైన అప్డేట్. ఎంసెట్ హాల్ టికెట్లను (TS EAMCET - 2022 Hall Tickets) అధికారులు తాజాగా విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ (TS EAMCET Website) నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ హాల్ టికెట్లు జులై 11 వ తేదీ వరకు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటనలో స్పష్టం చేశారు. ఎంసెట్ పరీక్షకు (EAMCET Exam) అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆ తేదీలోగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఎంసెట్ కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. అయితే.. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని మాత్రం కల్పించారు అధికారులు. అభ్యర్థులు ఆలస్య రుసుముతో జులై 7 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. ఇందుకోసం రూ.2700 ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు హాల్ టికెట్లను ఈ కింది స్టెప్స్ తో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. Step 1:అభ్యర్థులు మొదటగా ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ (https://eamcet.tsche.ac.in/) ను ఓపెన్ చేయాలి. Step 2: మీకు హోం పేజీలో Download Hall Ticket (E & AM) లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి. Step 3: మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో Registration Number, Qualifying Examination Hall Ticket No, Date of Birth వివరాలను నమోదు చేయాలి. Step 4:వివరాలను నమోదు చేసిన తర్వాత Get Hallticket ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Step 5:తర్వాత స్క్రీన్ పై మీ హాల్ టికెట్ కనిపిస్తుంది. హాల్ టికెట్ ను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి. TS Entrance Exams: జులైలో తెలంగాణలో ఎంసెట్, ఐసెట్ తో పాటు మొత్తం 6 ఎంట్రెన్స్ ఎగ్జామ్స్.. తేదీలివే
ఇదిలా ఉంటే.. తెలంగాణలో జులై 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ ఎగ్జామ్ ను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 14, 15 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ గ్రూప్ ఎగ్జామ్స్, జులై 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ కు సంబంధించిన ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.