తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ (TS EAMCET Counselling) షెడ్యూల్‌ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2022 ఆగస్టు 21న ప్రారంభమై, ఆగస్టు 29న ముగుస్తుంది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 23- 30 మధ్య సర్టిఫికేషన్ వెరిఫికేషన్ (Certificate Verification) ఉంటుంది. స్లాట్లను బుక్ చేసుకోవడానికి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి 2 సెట్ల జిరాక్స్ కాపీలు అవసరమవుతాయి. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్స్ ఏవో చూద్దాం.
టీఎస్ ఎంసెట్-2022 కౌన్సెలింగ్: సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్స్
- టీఎస్ ఎంసెట్-2022 ర్యాంక్ కార్డ్
- టీఎస్ ఎంసెట్ -2022 హాల్ టికెట్
- S.S.C లేదా అందుకు సమానమైన మార్కుల మెమో
- ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైన మెమో-కమ్-పాస్ సర్టిఫికేట్
- ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (T.C)
- 01-01-2022న లేదా ఆ తర్వాత జారీ చేసిన ఇన్ కమ్ సర్టిఫికేట్ (వర్తిస్తే)
- తహసీల్దార్ జారీ చేసిన EWS ఇన్కమ్ సర్టిఫికేట్, 2022-23 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యేది. (వర్తిస్తే)
- అధికారులు జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్
- అభ్యర్థికి ఇన్‌స్టిట్యూషల్ ఎడ్యుకేషన్ లేనిపక్షంలో అర్హత పరీక్షకు ముందు 7 సంవత్సరాల కాలానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్
- స్థానికేతర అభ్యర్థులకు సంబంధించి, అన్రిజర్వ్డ్ సీట్ల కింద కేటాయింపు కోసం వారిని పరిగణనలోకి తీసుకోవాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
ఈసారి మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ పూర్తిచేయనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. మొదటి విడత కోసం ఈనెల (ఆగస్టు) 21 నుంచి 29 వరకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపింది. ఆగస్టు 23 నుంచి 30 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఆగస్టు 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 6న ఇంజినీరింగ్.. మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్ చేపడతామని.. ఇందుకు సెప్టెంబరు 28, 29 తేదీల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అభ్యర్థులకు తెలిపింది.
సెప్టెంబరు 30న రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని, సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుందని ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. రెండో విడత సీట్లను అక్టోబరు 4న కేటాయించనుంది.
ఇక, అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్, అక్టోబరు 17న తుదివిడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉండనుంది. అక్టోబర్ 20న స్పాట్ ఆడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. కాగా, తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఆగస్టు 12న విడుదలయ్యాయి. ఎసెంట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 88.34 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exams, JOBS, TS EAMCET 2022